TDP : నేను దేనికైనా రెడీ!
విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద కేసులు ఉన్నాయంటూ హడావిడి చేసిన నానికి నా సవాల్...నా మీద కేసు గురించి దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.
విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద కేసులు ఉన్నాయంటూ హడావిడి చేసిన నానికి నా సవాల్...నా మీద కేసు గురించి దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.
విజయవాడలో మోదీ రోడ్ షో అట్టర్ ప్లాప్ అన్నారు కేశినేని నాని. 2014లో ఇదే కూటమితో మోదీ వెళ్ళారని.. ఢిల్లీ లాంటి రాజధాని కడతామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఓడించడం కలేనన్నారు.
కేశినేని నాని మీద సానుభూతి పడాల్సిందేనని చురకలంటించారు విజయవాడ బీజేపీ వెస్ట్ అభ్యర్థి సుజనా చౌదరి. కేశినేని నాని స్థాయికి తాను దిగజారలేనని చెప్పారు. ఇంత త్వరగా కేశినేని నాని దిగజారిపోతారని అనుకోలేదన్నారు సుజన. కేశినేని నాని లూజ్ కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు.
కేశినేని నాని ఓ దద్దమ్మ..విజయవాడ ఎంపీగా నా గెలుపు ఖాయమన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. రెండేళ్లుగా విజయవాడ పార్లమెంట్ పరిధితో తాను పర్యటిస్తున్నానని..ఈ సారి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు.
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ఫైర్ అయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీ పెడితే.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని బీజేపీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీలో జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు.
ఏపీలో చంద్రబాబు, జగన్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని టీడీపీకి సవాల్ విసిరారు కేశినేని నాని. కనీసం ఒక సచివాలయం కట్టలేని చంద్రబాబు అభివృద్ది గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తొస్తారని విమర్శించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేయటమే చంద్రబాబు 'బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' అని కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ మడిచి జేబులో లేదా ఎక్కడైనా పెట్టుకో లోకేష్ అంటూ ఎద్దేవ చేశారు.
నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు కి కూడా భారతరత్న ప్రకటించాలని వైసీపీ నేత కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా కోరారు. సినీ రంగంతో పాటు, రాజకీయాల్లో ఆయన చేసిన సేవలను కేంద్రం గుర్తించి భారతరత్న ప్రకటించాలని కోరారు
వైసీపీలో అభ్యర్థుల జాబితా మార్పు చేర్పులపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్లు చేశారు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఆరోపించారు. మూటలు ఇచ్చాకే సీట్లల్లో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు.