Delhi : అలా చేస్తే భోజనం పెట్టొద్దు... మహిళా ఓటర్లకు కేజ్రీవాల్ పిలుపు

ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రచారాలు మొదలుపెట్టేసాయి. నిన్న ఢిల్లీలో జరిగిన మహిళా సమ్మాన్ సమారోహ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ జపం చేసే భర్తలకు అన్నం పెట్టొద్దని మహిళలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

Aravind Kejriwal: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం..చివరకు అదే ఆరోపణలతో అరెస్ట్..కేజ్రీవాల్ ప్రస్థానం ఇదే..
New Update

Kejriwal Comments On BJP : చాలామంది మగవాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పేరు జపిస్తున్నారు. దాన్ని మీరు సరిచేయాలి. మీ భర్తలు మోదీ పేరు జపిస్తే వాళ్ళకు రాత్రి చెప్పండి అని మహిళలకు సలహా ఇచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ పార్టీ(AAP Party) అధినేత కేజ్రీవాల్(Kejriwal). ఢిల్లీలో మహిళా సమ్మాన్ సమారోహ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు కేజ్రీవాల్. ఢిల్లీలో మహిళలకు రూ.1000 పథకం మొదలుపెట్టిన తర్వాత ఢిల్లీ సీఎం(Delhi CM) మొదటిసారి మహిళలతో సంభాషించారు. ఇందులో ఆప్‌కు మహిళలు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. అలా అని ప్రమాణం చేయాలని కేజ్రీవాల్ కోరారు. మీ సోదరుడు మీకు ఎప్పుడూ అండగా ఉంటాడని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీకి మద్దతు ఇచ్చే మహిళలకు కూడా ఈ విషయం చెప్పాలని కోరారు.

బీజేపీ మీద నిప్పులు...

మహిళలతో సమావేశంలో కేజ్రీవాల్ బీజేపీ. ప్రధాని మోదీ మీద మండిపడ్డారు. దేశానికి వారు ఏం చేసింది లేదని ఆరోపించారు. ఉచిత కరెంట్(Free Current), ఉచిత్ బస్(Free Bus), మహిళలకు రూ.1000 పథకం లాంటివన్నీ ఆప్‌ ఏ ఇచ్చిందని చెప్పారు. బీజేపీ మహిళల కోసం ఏం చేసింది.. వారికి ఎందుకు ఓటు వేయాలని అడిగారని కేజ్రీవాల్ అడిగారు. ఈసారి ఎన్నికల్లో ఆప్‌కు, కేజ్రీవాల్‌కు ఓటు వేయాలని అందరికీ చెప్పాలని సూచించారు. మహిళా సాధికారత పేరుతో బీజేపీ మోసం చేస్తోందని అన్నారు.

పార్టీలో మహిళకు ఒక పని ఇచ్చేసి అదే సాధికారత అంటున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోపించారు. మహిళలకు పదవులు ఇవ్వడం మీద తనకేమీ కంప్లైంట్ లేదని... కానీ దాని వలన ఒకరిద్దరు మాత్రమే లబ్ధి పొందుతున్నారని..మిగిలిన స్త్రీలు ఏమవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో తాము తీసుకువచ్చిన ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనే నిజమైన సాధికారత మహిళలకు తీసుకువస్తుందని కేజ్రీవాల్ అన్నారు.

Also Read : Delhi : ఢిల్లీలో బోరుబావిలో చిన్నారి..కొనసాగుతున్న సహాయక చర్యలు

#aravind-kejriwal #delhi #bjp #women #aap-party #pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి