Harish Rao: కేసీఆర్ ప్రధాని కాడు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోడీ, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని.. కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ప్రధాని కాలేడు కదా అని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు హరీష్ రావు. రెండు పార్టీలు ఒకటే అన్నారు. By V.J Reddy 23 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS MLA Harish Rao: బీజేపీ (BJP), కాంగ్రెస్ పార్టీలు (Congress Party) ఒకే నాణానికి బొమ్మా బొరుసు లాంటివని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao). వారి నినాదాలు మాత్రమే వేరు, విధానాలు ఒకటే అని అన్నారు. జెండాలు మాత్రమే వేరు, ఎజెండా ఒకటే అని... బలహీనమైన రాష్ట్రాల, బలమైన కేంద్రమే ఈ రెండు పార్టీల విధానం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రల హక్కులను కాలరాయడంలో రెండింటిదీ ఒకే దారి అని విమర్శించారు. ALSO READ: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కారణం ఇదేనా? ఉమ్మడి జాబితాలోని అంశాలను ఒక్కొక్కటిగా కేంద్రానికి బదిలీ చేసింది ఈ పార్టీలే. రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వానికి ధారాదత్తం చేసిన చరిత్ర ఈ పార్టీలదే. రాష్ట్రాలను నామమాత్రం చేయడమనే దీర్ఘకాలిక లక్ష్యానికి రెండు పార్టీలు జోడెద్దుల్లా పనిచేస్తున్నాయని అన్నారు. కేసీఆర్ ప్రధాని కారు.. హరీష్ రావు మాట్లాడుతూ.. 'కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ‘బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రధాని అవుతారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ (Prime Minister) ప్రధాని అవుతారు. బీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ (KCR) ప్రధాని కారు కదా? మరి బీఆర్‌ఎస్‌కు (BRS Party) ఎందుకు ఓటెయ్యాలి? అసలు పార్లమెంట్ ఎన్నికలతో (Parliament Elections) బీఆర్‌ఎస్‌కు ఏం సంబంధం?’ ఇలా సాగుతుంది ఆ రెండు పార్టీల నాయకుల వాదన. బీఆర్‌ఎస్ లాంటి ప్రాంతీయ శక్తులకు అసలు లోక్‌సభ ఎన్నికలతో ఏం పని? బీఆర్‌ఎస్ కు లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha) పోటీ చేసే హక్కు/ అర్హత, ఏంటి? అని ప్రశ్నించే దాకా తెగింపు ప్రదర్శిస్తున్నాయి. పైకి చూస్తే ఇది నిజమే కదా? అనిపిస్తుంది. కానీ, ఆ ప్రకటనల, వాదనల లోగుట్టు చాలా వికృతమైనది. ఈ రెండు పార్టీలు ఒకే స్వరం వినిపించడం వెనుక కచ్చితంగా రహస్య ఎజెండా ఉంది.' అని అన్నారు. ALSO READ: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు DO WATCH: #kcr #bjp #lok-sabha-elections #brs-party #congress-party #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి