KCR On MP Elections : లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్(KCR) ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇటీవల ఆసుపత్రి నుంచి డీఛార్జి అయ్యి గాయం నుంచి కోలుకున్నాక లోక్‌సభ ఎన్నికలపై వ్యూహం రచిస్తున్నారు గులాబీ బాస్. తెలంగాణలో బీఆర్‌ఎస్ తరపు 9మంది ఎంపీలు గత ఎన్నికల్లో ఎన్నుకోబడ్డారు. వీరిలో ఆరుగురిని మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు కేసీఆర్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మెదక్ ఎంపీగా ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మెదక్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
ALSO READ: వైసీపీలో చిచ్చు పెట్టిన రేవంత్.. ఎంపీలపై సీఎం జగన్ సీరియస్
సిట్టింగుల్లో చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డికి.. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్‌రావుకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వరంగల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉంది. సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడంతో అసెంబ్లీ స్థానాల్లో నష్టపోయామనే భావనలో బీఆర్‌ఎస్ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో ముగ్గురికి టికెట్లు కేసీఆర్ ఓకే చేసినట్లు టాక్. కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్, నిజామాబాద్ నుంచి కవిత, ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్ పోటీచేసే అవకాశం ఉంది. ఎన్నికల కోసం సన్నద్ధతను పారంభించారు కవిత, వినోద్‌కుమార్. గత ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన బూర నర్సయ్యగౌడ్.. బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడంతో భువనగిరి నుంచి.. జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లను పరిశీలిస్తున్నారు కేసీఆర్.
ALSO READ: రూ.500లకే గ్యాస్ సిలిండర్ పై కీలక అప్డేట్.. రూల్స్ ఇవే!
ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్కాజ్‌గిరి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి. మల్కాజ్‌గిరి నుంచి ఎవరు పోటీచేస్తారనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. సికింద్రాబాద్ నుంచి గత ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ పోటీ.. వచ్చే ఎన్నికల్లోనూ సాయికిరణ్‌ను పోటీకి దింపాలని ఆలోచలని కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు అమిత్‌రెడ్డిని పోటీకి దింపే ఛాన్స్. ఇప్పటివరకు ఒక్కసారి గెలవని స్థానాలపై బీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో గెలిచారు బీఆర్‌ఎస్ అభ్యర్థులు. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) పై పార్టీ సీనియర్ నాయకులతో చర్చిస్తున్నారు కేసీఆర్. మోదీ, సోనియా తెలంగాణ నుంచి పోటీచేస్తే ఎలాంటి వ్యూహాంతో ముందుకెళ్లాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారట.