KCR: జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరికలు
BRS ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్లో పడొద్దని హెచ్చరించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.