Vamshi Chand Reddy: ఏంఐఏంలోకి డీకే అరుణ.. వంశీ చంద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అసదుద్దీన్ పిలుస్తే డీకే అరుణ ఎంఐఎంలో కూడా చేరవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి. అవకాశవాద రాజకీయాలకు డీకే అరుణ మారుపేరు అని అన్నారు. కాంగ్రెస్ కు డీకే అరుణ వెన్నుపోటు పొడిచిందని.. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకం అని మండిపడ్డారు.