ఆసియా కప్‌లో భాగంగా రేపు జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడంపై ఇతర క్రికెట్ బోర్డులు స్పందించాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రశ్నించింది. ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్న తమ టీమ్‌కు సైతం ప్రతీ మ్యాచ్ ఇంపార్టెంటే అన్న బంగ్లా క్రికెట్ బొర్డు.. ఏసీసీ తమ టీమ్ ఆడే మ్యాచ్‌లకు సైతం రిజర్వ్ డే ప్రకటించాలంది. బంగ్లా క్రికెట్ బోర్డుతో పాటు అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది.
తమ జట్టు ఇప్పుడిప్పుడే పెద్ద టీమ్‌లతో తలపడుతుందని, ఆ టీమ్‌లపై విజయం సాధించి వరల్డ్ కప్ బరిలో నిల్చిందని ఆ దేశ క్రికెట్ బోర్డ అధ్యక్షుడు తెలిపాడు. అఫ్ఘన్ టీమ్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే ప్రకటించాలని కోరాడు. బీసీసీఐ కార్యదర్శి జైషా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఏసీసీ సెక్రటరీగా ఉండటంతో ఏసీసీ భారత టీమ్ ఆడే మ్యాచ్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగానే.. పాకిస్థాన్‌లో జరిగే టోర్నీని తమ ఆటగాళ్లకు ప్రమాదం పొంచి ఉందనే వంకతో పాక్‌కు తాము రామని చెప్పారన్నారు. దీంతో భారత్‌తో మ్యాచ్‌లు ఆడాలంటే ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు శ్రీలంకకు వెళ్లాల్సి వస్తుందన్నారు. భారత టీమ్ మాత్రం లంకలోనే విశ్రాంతి తీసుకుంటుందని విమర్శించారు.
కాగా భారత్-పాక్ టీమ్‌లు 2005 నుంచి నేటి వరకు దైపాక్షిక సిరీస్‌లో పాల్గొనేదు. ఇరు జట్లు ఎప్పుడూ ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే హై ఓల్టేజ్ మ్యాచ్‌లా మారింది. అందుకే ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డేను కేటాయించినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. మరోవైపు ఇటీవల జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా రేపు జరుగబోయే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవద్దని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.