JP Nadda: వచ్చేసారి తెలంగాణలో బీజేపీదే అధికారం: జేపీ నడ్డా

తెలంగాణలో ఓటింగ్‌ శాతం 7.1 నుంచి 14 శాతానికి పెరిగిందని బీజేపీ జాతీయ మండలి సమావేశంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ భారత్‌లో కాంగ్రెస్‌ కంటే బీజేపీ మెరుగైన స్థితిలో ఉందన్నారు.

JP Nadda: హమ్మయ్య..మొత్తానికి జేపీ నడ్డా భార్య కారు దొరికింది..అసలేం జరిగిందంటే!
New Update

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ జాతీయ మండలి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి మెరుగుపడిందని.. వచ్చేసారి అక్కడ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని అన్నారు. చాలా సందర్భాల్లో ఓటమిలో కూడా గెలుపుంటుందని.. తెలంగాణలో కూడా తమ పార్టీ అలాంటిదే సాధించిందని పేర్కొన్నారు. గతంలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉండేవారు. 7.1 శాతం ఓట్లు ఉండేవి. కానీ ఇప్పుడు 14 శాతం ఓటింగ్ పెరిగిందని.. ఎమ్మెల్యేల సంఖ్య కూడా 8కి చేరుకుందని అన్నారు.

Also Read: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. బీజేపీలోకి మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం..!

కాంగ్రెస్‌ కంటే బీజేపీ ముందుంది

ఇప్పటి నుంచే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పనిలో ఉందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో కూడా బీజేపీ ఓట్లు 10 శాతం, మూడు అసెంబ్లీ సీట్లు ఉండేవని.. ఇప్పుడు 77 సీట్లు గెలుచుకొని.. 38.5 ఓట్ల శాతం సంపాదించామని అన్నారు. అక్కడ కూడా త్వరలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారత్‌లో బీజేపీ లేదని చాలామంది విమర్శిస్తుంటారని.. కానీ అక్కడ కాంగ్రెస్‌ కంటే బీజేపీ మెరుగైన స్థితిలో ఉందని జేపీ నడ్డా పేర్కొన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు 28 మంది ఎంపీలు ఉంటే.. బీజేపీకి 29 మంది ఉన్నారని.. అలాగే కాంగ్రెస్‌కు 7గురు రాజ్యసభ సభ్యులుంటే బీజేపీకి 8 మంది ఉన్నారన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత రత్నల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పీవీ నరసింహ రావు విభిన్న బాధ్యతలు నిర్వహించి.. ప్రధానిగా దార్శనికతను ప్రదర్శిస్తూ.. ఆర్థిక సంస్థలతో ముందుకెళ్లారని కొనియాడారు. భారతీయ భాషల ఉన్నతి కోసం ఆయన విశేష కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రి జీ.కిషన్‌ రెడ్డి, ఏపీ పార్టీ అధ్యక్షురాలు పుందేశ్వరీతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు.

Also Read: తమపై బురదజల్లేందుకే.. శ్వేతపత్రంపై హరీష్ ఫైర్!

#telugu-news #ap-news #telangana-news #bjp #ap #jp-nadda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe