Ap Politics: జోగి రమేష్ కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది: బోడె ప్రసాద్! జోగి రమేష్ కు అతి త్వరలోనే ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. జోగి రమేష్‌ను అభ్యర్థిగా ప్రకటించిప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. By Bhavana 17 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Bode Prasad Comments On Jogi Ramesh: జోగి రమేష్ కు అతి త్వరలోనే ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. జోగి రమేష్‌ను అభ్యర్థిగా ప్రకటించిప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే ఆయన కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని బోడె ప్రసాద్ విమర్శించారు. వైసీపీ (YCP) నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసిన టీడీపీ (TDP) నాయకులు గట్టిగా నిలబడ్డారని బోడె ప్రసాద్ అన్నారు. తనకు సీటు కేటాయిస్తే ఆయన బాణాసంచులు కాల్చి, మిఠాయిలు పంచారని... ఆయనకు మతి భ్రమించిందని బోడె ప్రసాద్ అన్నారు. ‘‘మైలవరం, పెడన, పటమట నుంచి రౌడీ షీటర్లను దింపి హడావిడి చేశారు. బట్ట అనిల్, కొత్తపల్లి రాజేష్, నరగాని అశ్విన్ అనే రౌడీ షీటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. పెనమలూరు స్టేషన్‌లో సీఐ, సిబ్బంది అందరూ విఫలమయ్యారు. పోరంకి టీడీపీకి కంచుకోట. పోరంకిలో కావాలనే గంట పాటు పోలింగ్ నిలిపివేసి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. 200 మీటర్ల దూరంలో ఉండాల్సిన వ్యక్తులను పోలింగ్ కేంద్రం గేట్ ముందు నిలబడ్డారు. దీన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదు. Also Read: ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా? మా మీద 3 కేసులు పెట్టారు. జోగి రమేష్ నేరుగా అల్లర్లుకు పాల్పడితే అతనిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. జోగి రమేష్ (Jogi Ramesh) వలస పక్షి, ఎన్నికల ఫలితాలు తరువాత అడ్రస్ ఉండడు. జోగి రమేష్‌ని చూసుకుని టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వ్యక్తులకు వడ్డీతో సహా చెల్లిస్తాం.. జోగి రమేష్ పోరంకిని స్వాధీనం పరుచుకున్నానని వీర్రవీగుతున్నారు. ఇది ఏమైనా రాజుల రాజ్యమా.. ప్రజాస్వామ్యంలో స్వాధీనం చేసుకోవడం ఏంటి..? నా వెంట్రుక కూడా పీకలేరు.. నీ తరం కాదు నీ అబ్బా తరం కాదు. నేను ఏనాడూ జోగి రమేష్ మీద నోరు జారలేదు. జోగి రమేష్ కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. జూన్ 4 తర్వాత గేమ్ మొదలవుతుంది. మా కార్యకర్తలను అదుపులో ఉంచుకున్నాం కాబట్టే జోగి రమేష్ పోరంకి దాటి వెళ్లారు. పెనమలూరు సీఐ పూర్తిగా విఫలం అయ్యారు. 20 ఏళ్ళ చరిత్రలో పెనమలూరు నియోజకవర్గంలో ఏనాడూ ఘర్షణలు జరగలేదు. టీడీపీ కూటమి 100 శాతం అధికారం చేపడుతుంది’’ అని బోడె ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. #ycp #tdp #ap #politics #jogi-ramesh #bode-prasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి