UPSC CSE Notification 2025: యూపీఎస్సీ భారీ నోటిఫికేషన్.. 1,129 పోస్టుల భర్తీ: కొద్దిరోజులే ఛాన్స్!

యూపీఎస్సీ భారీనోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ 2025, ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ 2025కు సంబంధించి ప్రకటన వదిలింది. CSEలో 1,056 పోస్టులు, IFS విభాగంకింద 150 ఖాళీలను భర్తీ చేస్తోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 11లోగా అప్లై చేసుకోవాలి.

New Update
UPSC Civil Services Exam 2025 Notification

UPSC Civil Services Exam 2025 Notification

UPSC CSE

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (CSE) 2025 నోటిఫికేషన్‌లను రిలీజ్ చేసింది. వివిధ కేంద్ర సర్వీసులకు చెందిన సుమారు 979 సివిల్ సర్వీసెస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 22 నుంచి ప్రారంభం అయింది. ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 25న నిర్వహించనున్నారు.

Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 22 నుంచి ప్రారంభం అయింది.

దరఖాస్తు ప్రక్రియ చివరితేది: ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రిలిమ్స్‌ పరీక్ష పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్‌, వరంగల్‌.

మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.

Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట 

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌

ఇవి మాత్రమే కాకుండా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (IFS)కు సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 150 పోస్టుల ఖాళీలతో ప్రకటన వదిలింది. దీని కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 11లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట విభాగాల్లో డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు