NEET సీట్ల కేటాయింపుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

నీట్ పీజీ సీట్ల పంపకంలో రాష్ట్రాల కోటా, రిజర్వేషన్లు చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. 

New Update
SUPREME COURT

పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోటా గురించి సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నీట్ పీజీ మెడికల్ సీట్ల పంపకంలో రాష్ట్రాల కోటా, స్థానిక రిజర్వేషన్లు చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని స్పష్టం చేసింది. నీట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్‌ ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం చెప్పింది. నీట్‌ పీజీ మెడికల్‌ అడ్మిషన్స్‌ స్థానిక రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు విద్యార్థులు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. 

Also Read: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన

రాష్ట్ర కోటాలో రిజర్వేషన్లు కుదరవని తేల్చి చెప్పింది. పీజీ మెడికల్‌ సీట్లలో నివాస ప్రాంతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఏమాత్రం సరి కాదని.. అలా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ని ఉల్లంఘించడమే అవుతుందని జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సుధాంశు ధులియా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి ధర్మాసనం అభిప్రాయపడింది. మనమంతా భారతదేశంలోనే నివసిస్తున్నామని పేర్కొంటూ.. ప్రాంతం, రాష్ట్రం అంటూ ఏమీ విభజనలు ఏమీ లేదని కోర్టు చెప్పుకొచ్చింది. భారతదేశంలో ఎక్కడ నివాసించే వారైనా వారందరూ ఇండియన్ సిటిజన్స్ అని ధర్మాసనం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ప్రవేశాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని ధర్మాసనం తెలిపింది.

Also Read: సౌదీ అరేబియాలో 9 మంది భారతీయులు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు