TG Govt Jobs: గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ షాక్.. మరింత కఠినంగా సిలబస్.. రానున్న మార్పులివే!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మరింత కఠినం కానున్నాయి. మూసపద్ధతికి స్వస్తి చెప్పి నయా ట్రెండ్‌లో ప్రశ్నాపత్రాలను తయారు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. బహుళ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులనే అధికారులుగా ఎంచుకోవాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

New Update
TGPSC

TGPSC key decision on Group exams Pattern

TG Govt Jobs: తెలంగాణ ఉద్యోగ నియామకాలు మరింత కఠినంగా మారనున్నాయి. మూసపద్ధతికి స్వస్తి చెప్పి నయా ట్రెండ్‌లో ప్రశ్నాపత్రాలను తయారు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. బహుళ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులనే అధికారులుగా ఎంచుకునే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

నిపుణులతో కీలక చర్చలు..

ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నావలో కీలక మార్పులు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఉన్నతాధికారులు, విద్యారంగ నిపుణులు, విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్‌లర్‌లతో సమావేశం నిర్వహించింది. సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, మూల్యాంకనం, స్టేట్ హిస్టరీ అంశాలపై సుధీర్ఘంగా చర్చలు జరిపారు. పరీక్షల కోసం పెద్ద ఎత్తున క్వశ్చన్ బ్యాంకు తయారు చేయాలని, ఇందుకోసం జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలను అధ్యయనం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మార్పులు, చేర్పులపై వీసీలు నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించింది. 

మూడు విభాగాలుగా ప్రశ్నావళి..

గ్రూప్స్ పరీక్షల్లో సులభమైన, సాధారాణమైన ప్రశ్నలకు స్వస్తి పలికి కొత్తగా ప్యాటర్న్ రెడీ చేయాలని ప్లాన్ చేస్తోంది. బహుళ నైపుణ్యాలపై అభ్యర్థులే ఉద్యోగులుగా వస్తే పనిలో మరింత నాణ్యత పెరుగుతుందని భావిస్తోంది. అయితే ఇందుకోసం సబ్జెక్టు నిపుణుల నుంచి ప్రశ్నలు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. వర్సిటీల్లోని కొంతమంది నిపుణులతో ప్యానల్ ఏర్పాటు చేసి, పరీక్ష నిర్వహించే ముందు సిలబస్, అధ్యాయాలను మూడు విభాగాలుగా విభజించి ప్రశ్నలు తయారు చేయాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా ఆర్ట్స్ గ్రూపుల నుంచి ప్రశ్నలు కొత్తగా ఉండాలని, గ్రూప్స్ ద్వారా ఎంపికయ్యే ప్రభుత్వ ఉద్యోగి ప్రజా జీవితంలో ఎంత కఠిన నిర్ణయాలైనా తీసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. 

AI ట్రెండ్ లో కొన్ని ప్రశ్నలు..
ఇక ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తుండంతో కొత్తగా చేరే ఉద్యోగులకు టెక్నాలజీపై పరిజ్ఞానం, పట్టు ఉంటే బాగుటుందని టీజీపీఎస్సీ ఆశిస్తోంది. ఇందులో భాగంగా IT నిపుణులు, డేటా అనలిస్టుల సలహాలతో సిలబస్ రూపొందించే పనిలో ఉన్నారు. అంతర్జాతీయ AI లాంగ్వేజ్ లో కూడా పలు ప్రశ్నలు ఇవ్వాలనే ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇకపై తెలంగాణ చరిత్ర కంటే తెలంగాణ సమాజ పోకడలు, సంస్కృతి గురించి ప్రశ్నలు ఇవ్వాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారట. 

ఇది కూడా చూడండి: AP: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్

మళ్లీ ఇంటర్వ్యూలు..
గ్రూప్ నియామకాల్లో ఇంటర్వ్యూ పద్ధతిని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూ విధానంతో పలువురికి అన్యాయం జరుగుతోందని, పారదర్శకంగా నియామకాలు జరగడంలేదని గత ప్రభుత్వం 2022లో గ్రూప్‌-1 సహా అన్నింటిలో ఈ పద్ధతి రద్దుచేసింది. కానీ దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో గ్రూప్‌-1లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తుండగా.. ఇప్పుడు తెలంగాణలోనూ ఇంటర్వ్యూ విధానం పునరుద్ధరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. 

ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం

tgpsc | group exams | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు