TG Govt Jobs: గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ షాక్.. మరింత కఠినంగా సిలబస్.. రానున్న మార్పులివే!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మరింత కఠినం కానున్నాయి. మూసపద్ధతికి స్వస్తి చెప్పి నయా ట్రెండ్‌లో ప్రశ్నాపత్రాలను తయారు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. బహుళ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులనే అధికారులుగా ఎంచుకోవాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది.