/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TET-NOTIFICATION-RELEASED-jpg.webp)
టీచర్ ఎలిజిబిటీ టెస్ ప్రాథమిక కీని డిపార్ట్‌మెంట్ ఆప్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. జనవరి 2 నుంచి 20 తేదీ వరకు ఈ టెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2 లక్షల 75 వేల 753 మంది దరఖాస్తులు చేసుకోగా.. 74శాతం పరీక్షకు హాజరైయ్యారు. అంటే 2లక్షల 5వేల మంది టెట్ పరీక్ష కేంద్రాలకు వచ్చి ఎగ్జామ్ రాశారు.
టెట్ ప్రీలిమినరీ కీతోపాటు రెస్పాస్ షీట్‌ను అధికారిక వెబ్‌సైట్ tgtet2024.aptonline.inలో పెట్టారు అధికారులు. కీపై అభ్యంతరాలు ఉంటే జనవరి 25 నుంచి 27 సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కోరారు.
ఇది కూడా చదవండి: ASAD: అసదుద్దీన్ ఓవైసీకి బిగ్‌షాక్.. సస్పెన్షన్ వేటు!