TET Hall Tickets: తెలంగాణ విద్యాశాఖ టెట్ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. టెట్ హాల్ టికెట్స్ విడుదల చేసింది. పరీక్షలు జనవరి 2 నుంచి 20 వరకు జరగనున్నాయి. డౌన్‌లోడ్ చేసుకునేందుకు https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక వెబ్‌సైట్ ను సంప్రదించాలని సూచించింది. 2.75 లక్షలకుపైగా దరఖాస్తులు.. మందికి పైగా దరఖాస్తు.. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 ఎగ్జామ్స్ ఉంటాయి. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తంగా జనవరి జనవరి 2 నుంచి 20 వరకు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు సెషన్- 1 పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. నవంబర్ 7 నుంచి 20 వరకు టెట్‌కు దరఖాస్తులు స్వీకరించగా దాదాపు 2.75లక్షల మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇది కూడా చదవండి: Kohli: విరాట్‌ను అవమానించిన ఆసీస్ మీడియా.. ఆ పేరుతో హెడ్ లైన్స్! మెగా డీఎస్సీ.. ఇటీవలే డీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించి ఖాళీలను భర్తీ చేసిన తెలంగాణ సర్కార్.. మరోసారి మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం త్వరలోనే మరో 6వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని రేవంత్ సర్కార్ చెప్పింది. ఇందులో భాగంగానే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. తాజాగా పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది.