TGPSC: తెలంగాణ గ్రూప్‌-3  ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే!

తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్ జాబితాను TGPSC రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకునేందుకు https://www.tspsc.gov.in/ ను సంప్రదించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. 

New Update
TG News: తెలంగాణలో ఆ రెండు పరీక్షలు రద్దు!

Telangana Group-3 results released

TGPSC: తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్ జాబితాను TGPSC రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకునేందుకు https://www.tspsc.gov.in/ ను సంప్రదించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. గ్రూప్‌-3 పరీక్ష తుది కీ, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లతో పాటు ఓఎంఆర్‌ షీట్లను డౌన్‌లోడ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

టాప్ 10 లిస్ట్..

g 3

 1,365  ఉద్యోగాలకు నోటిఫికేషన్..

రాష్ట్రంలో 1,365 గ్రూప్‌-3 ఉద్యోగాలకు 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో మూడు పేపర్లుగా జరిగిన ఈ పరీక్షలకు కేవలం 50.24శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్‌- 1, గ్రూప్‌ -2 ఫలితాలను టీజీపీఎస్సీ తాజాగా గ్రూప్‌-3 ఫలితాలను విడుదల చేసింది. అలాగే, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను మార్చి 17న, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నారు.

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు