TGPSC: తెలంగాణ గ్రూప్-1 మరోసారి రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో వివాదాల మధ్య ఇటీవలే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించగా తాజాగా మరో మూడు అంశాలు వివాదాస్పదమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలైన తర్వాత నిబంధనలు మార్పులు కుదరదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం తెలంగాణలో సంచలనం రేపుతోంది. రిక్రూట్‌మెంట్ కు ముందే నిబంధనలు సిద్ధం చేసి, ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగ అర్హత ప్రమాణాలను నియామక ప్రక్రియ మధ్యలో మార్చకూడదని, అలా మారిస్తే నోటిఫికేషన్ చెల్లదని తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నియామకాలకు మూడు మార్పులు చేయడంతో మరోసారి రద్దు అయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: బీజేపీలోకి హరీష్ రావు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
స్పోర్ట్స్, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్..
ఈ మేరకు మొదటిది.. స్పోర్ట్స్ కేటగిరికి సంబంధించి ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొన్న వారే ఉద్యోగానికి అర్హులని టీజీపీఎస్సీ నోటిఫికేషన్ లో పేర్కొంది. కానీ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు లేకపోవడంతో ఇప్పుడు నేషనల్ వాళ్లకు సౌలభ్యం కల్పించింది. దీంతో సుప్రీం కోర్టు తీర్పు ఇందుకు విరుద్ధంగా ఉండటంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. రెండోవది.. ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ లో ప్రస్తావించని ఎస్టీ రిజర్వేషన్ ఇప్పుడు తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమైంది. మూడోవది.. ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్. ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. ఈ మూడు నోటిఫికేషన్ కు విరుద్ధంగా ఉండటంతో గ్రూప్-1 కు అడ్డంకులున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: బుల్డోజర్ టూ ఎస్సీ వర్గీకరణ.. డీవై చంద్రచూడ్ ఇచ్చిన సంచలన తీర్పులివే!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కు అనుగుణంగానే..
ఇక రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలుకావడానికి ముందే నియమ నిబంధనలు కచ్చితంగా ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వాటిని మార్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బంది పెట్టకూడదని, నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదని తెలిపింది. 'ఇది రాజ్యాంగానికి విరుద్ధం. రూల్స్ ఏకపక్షంగా కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కు అనుగుణంగా ఉండాలి'అని పేర్కొంది. ఇక సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేయడంపై అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: BREAKING: వైఎస్ భారతి పీఏ అరెస్ట్!
Also Read: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!