BREAKING: వైఎస్ భారతి పీఏ అరెస్ట్! AP: పోలీసుల నుంచి తప్పించుకున్న వర్రా రవీంద్ర రెడ్డి ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ అతన్ని కడపకు తరలిస్తున్నారు. కాగా గతంలో వైఎస్ భారతి వద్ద ఇతను పీఏగా పని చేసినట్లు ప్రచారం జరుగుతోంది. By V.J Reddy 08 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Ravindra Reddy: పోలీసుల నుంచి తప్పించుకున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్ర రెడ్డి ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్ నుంచి తెలంగాణకు పారిపోతుండగా మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ అతన్ని కడపకు తరలిస్తున్నారు. కాగా రవీందర్ రెడ్డి గతంలో మాజీ సీఎం జగన్ సతీమణి భారతికి పీఏగా పనిచేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు రోజులు క్రితం పోలీసులు రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 41నోటీసులు జారీ చేసి తాలూకా పోలీసులు వదిలేయడం చర్చనీయాంశమైంది. వర్రా అదృశ్యం కావడంతో ప్రత్యేక టీమ్ లను ఎస్పీ ఏర్పాటు చేశారు. గత నాలుగు రోజులుగా వర్రా ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పట్టారు. తాజాగా మహబూబ్ నగర్ సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బృందాలు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. Also Read: సీఎం సమోసాలు తిన్నదెవరు? రంగలోకి CID.. అసలేమైందంటే? తప్పుడు పోస్టులు పెడితే... ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, తప్పుడు పోస్టులు పెట్టె వారిపై చర్యలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. సోషల్ మీడియాలో కొందరు నేతలను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. కాగా వైసీపీ, కూటమి పార్టీలు ఈ పోస్టులపై విమర్శలు చేసుకుంటున్నాయని. తమ నేతలపై టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని వైసీపీ లేదు వైసీపీ వాళ్లే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. Also Read: హార్స్ పవర్ అంటే ఏంటి?..గుర్రాలకు ఎంత శక్తి ఉంటుంది? ప్రత్యేక చట్టం... సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత అన్నారు. ఈ సోషల్ మీడియాకు తాను కూడా ఒక బాధితురాలినే అని చెప్పారు. గతంలో కూడా తన కూడా కొందరు ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు పెట్టారని వాపోయారు. సోషల్ మీడియాలో తప్పుడు ఫోటోలో, అసభ్యకరణ పోస్టులు పెట్టె వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని అన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ.. తన కూతుళ్లను కొందరు నీచులు వదలలేదని.. సోషల్ మీడియాలో వారిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారని.. అలాంటి వారిని శిక్షించకుండా ఉండాలా? అని ప్రశ్నించారు. Also Read: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టు షాక్! #YS Bharathi PA #YSRCP VARRA RAVINDRA REDDY ARREST #POLICE CAUGHT VARRA RAVINDER REDDY మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి