/rtv/media/media_files/2025/03/21/Tyw7yv5UHhioRGBDGePe.jpg)
Telangana job notifications 2025
TG JOBS: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారం మరో 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ వర్గీకరణ ప్రకారం జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం. మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై ఈ వారంలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
జాబ్ క్యాలెండర్ ప్రకారం 20 నోటిఫికేషన్లు..
ఈ మేరకు 2024–25 జాబ్ క్యాలెండర్ ప్రకారం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటి తీర్పు తర్వాత ఎస్సీ ఉప-వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లను నిలిపివేసింది. దీంతో 2024 ఆగస్టు నుంచి ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు. అలాగే కొన్ని శాఖల్లో పదవి విరమణలు జరగగా ఖాళీల సంఖ్య పెరిగింది. దీని ఆధారంగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'
శిశు సంక్షేమ శాఖలో14,236 ఉద్యోగాలు..
గ్రూప్1,2,3,4 పోస్టులతోపాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్లో 4 వేలకు పైగా పోస్టులకు ఏప్రిల్ చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు ఆర్టీసీలోనూ 3వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మరిన్ని శాఖల ఖాళీల స్పష్టత రాగానే జాబ్‌క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదలకానున్నాయి. ఇక ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ను షెడ్యూల్ చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం వాయిదా వేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావాల్సివుంది.
Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్
telangana | telugu-news | today telugu news