/rtv/media/media_files/2025/03/21/Tyw7yv5UHhioRGBDGePe.jpg)
Telangana government key update on GPO posts
JOBS: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పనుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రామ పాలన అధికారి (GPO) పోస్టులను చేపట్టేందుకు సిద్ధమైంది. భూ భారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీవోలను భర్తీ చేయాలని చూస్తోంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం విధానాన్నే అనుసరించనుంది.
VRA, VROలను GPOలుగా..
ఈ మేరకు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే 10,954 జీపీవో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబ్‌చార్ట్ కూడా ఇటీవలే ప్రకటించగా బీఆర్ఎస్ హయాంలో నియమించిన అర్హులైన VRA, VROలను GPOలుగా నియమించి, మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చూస్తోంది. జీపీవోలుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల జాబితాను కలెక్టర్ల ద్వారా సేకరించగా దాదాపు 7 వేల మందికి అర్హతలున్నట్లు వెల్లడించింది. ఎంట్రన్స్ టెస్ట్నిర్వహించి, వీరందరినీ జీపీఓలుగా అపాయింట్ చేయాలని యోచిస్తోంది.
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
ఇదిలా ఉంటే.. జీపీవోలుగా చేరే వారంతా వీఆర్వో, వీఆర్ఏ అర్హత కోల్పోతారు. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. జీపీవోలుగా చేరినా తమ పూర్తి సర్వీసును పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోనలు చేస్తోంది. 10,954 పోస్టులన్నీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉన్నతాధికారులు దీనిపై స్పష్టమైన నివేదిక సమర్పించిన తర్వాతే నియామకం చేపట్టే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
Also read: Jwalapuram: ఇండియా చరిత్ర మార్చబోతున్న జ్వాలాపురం.. 74వేల ఏళ్ల క్రితంనాటి ఆనవాళ్లు
GPO posts | telugu-news | today telugu news