AP Constable Results 2025: AP కానిస్టేబుల్ ఫలితాలు 2025 రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి!

AP కానిస్టేబుల్ ఫలితాలు 2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇవాళ ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఫలితాలను విడుదల చేశారు. https://slprb.ap.gov.in ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

New Update
AP Constable Results 2025

AP Constable Results 2025

AP Constable Results 2025:

AP కానిస్టేబుల్ ఫలితాలు 2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇవాళ అంటే ఆగస్టు 1వ తేదీన ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు https://slprb.ap.gov.in ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

Also Read:‘కింగ్డమ్‌ 2’లో మరొక స్టార్ హీరో.. నిర్మాత నాగవంశీ అఫీషియల్ అప్డేట్

పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో వెబ్‌సైట్‌లో లాగిన్ అయి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అదే సమయంలో రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఫైనల్ రిజల్ట్స్‌లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు త్వరలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఈ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన ఈ ఫలితాలతో వేలాది మంది అభ్యర్థులకు భవిష్యత్తుపై స్పష్టత లభించింది. 

మొత్తం 6,100 పోస్టులు

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) 2025 సంవత్సరానికి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అందులో 3580 సివిల్, 2520 ఏపీఎస్‌పీ పోస్టులు ఉన్నాయి. 

దశల వారీగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పలు దశలలో జరిగింది. ఇందులో భాగంగా మొదట ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశకు అవకాశం లభించింది. ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) నిర్వహించారు. ఈ ఫిజికల్ టెస్టులు 2024 డిసెంబర్ 30 నుండి 2025 ఫిబ్రవరి 1 వరకు జరిగాయి. ఈ ఫిజికల్ టెస్టులలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 1, 2025న తుది రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల రిజల్ట్స్‌ ఇవాళ రిలీజ్ కావడంతో.. ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు త్వరలో నిర్వహించనున్నారు. 

Also Read:విజయ్ ‘కింగ్డమ్’ మూవీపై రష్మిక రివ్యూ.. ఒక్కమాటతో తేల్చేసిందిగా..

అప్లై చేసుకున్న అభ్యర్థులు

ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 5,03,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 4,59,182 మంది ఎగ్జామ్ రాయగా.. 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక చివరిగా తుది పరీక్షకు 37,600 మంది అర్హత పొందారు. వీరంతా ఎగ్జామ్ రాయగా.. ఇవాళ విడుదలైన ఫలితాల్లో మొత్తం 33,921 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. 

Advertisment
తాజా కథనాలు