RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. RRBనుంచి 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. RRB CEN నంబర్ 08/2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. మొత్తం 32,438 ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 2025 జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు కొనసాగనుంది. ఆన్ లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. 

New Update
rrb jobs

RRB Group D Notification released

RRB JOBS: నిరుద్యోగులకు భారతీయ రైల్వే భారీ శుభవార్త చెప్పింది. RRB CEN నంబర్ 08/2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. గ్రూప్ డీ వివిధ భాగాల్లో మొత్తం 32,438 ఉద్యోగాలుండగా అప్లికేషన్ ప్రక్రియ 2025 జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు కొనసాగనుంది. ఆన్ లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. 

ఉద్యోగ విభాగాలు: 

అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ), అసిస్టెంట్ (వర్క్ షాప్), అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్), అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఆపరేషన్ (ఎలక్ట్రికల్),    అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ పీవీ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్ షాప్), అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ టీఆర్ డీ, పాయింట్స్ మెన్ బీ ట్రాక్ మేనేజర్-4 ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: Watch Video: కారుపై ప్రతీకారం తీర్చుకున్న కుక్క.. వీడియో వైరల్

విద్యా అర్హతలు:

  • పదొవ తరగతి అర్హతతో అభ్యర్థులు గ్రూప్ డీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
    - టెక్నికల్ డిపార్ట్మెంట్లకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) ఇచ్చిన న్యాక్ లేదా ఐటీఐ డిప్లొమా తప్పనిసరి.
    - న్యాక్ లేదా ఐటీఐ డిప్లొమా లేని అభ్యర్థులు అర్హులు కాదు.

ఇది కూడా చదవండి: USA and Talibans: అమెరికా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం..

దరఖాస్తు ఫీజు
- జనరల్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500 (CBTకి హాజరైతే రూ.400 రీఫండ్ చేస్తారు).
- ఎస్సీ/ ఎస్టీ/ ఈబీసీ/ ఉమెన్/ ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు రూ.250 (CBTకి హాజరైన తర్వాత పూర్తి ఫీజు రీఫండ్ చేస్తారు).

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు