/rtv/media/media_files/2025/01/21/tOscNWJIUVaQOvGJk4og.jpg)
Dog Attacking on Car
అన్ని జంతువుల కంటే కుక్కలకు విశ్వాసం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ వాటికి కోపం వస్తే మాత్రం చెలరేగిపోతాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఓ కుక్కను కారు ఢీకొనడంతో.. దానిపై అది ప్రతీకారం తీర్చుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా తిరుపతిపురం అనే కాలనీలో ప్రహ్లాద్ సింగ్ ఘోషి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
Also Read: సింహం బోనులోకి వెళ్లిన యువకుడు.. చివరికీ
అయితే జనవరి 17న మధ్యాహ్నం అతడు తన కుటుంబంతో కలిసి కారులో బంధవుల పెళ్లికి బయలుదేరాడు. ఇంటి నుంచి దాదాపు 500 మీటర్ల దూరం వెళ్లాక రోడ్డు పక్కన పడుకున్న ఓ కుక్కకు ఆ కారు తగిలింది. కానీ ఆ కుక్కకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయినప్పటికీ ఆ కుక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. కారు వెంటే కొద్ది దూరం వరకు గట్టిగా అరుస్తూ వెంబడించింది. అయితే ప్రహ్లాద్ సింగ్ ఘోషి కుటుంబం పెళ్లి కార్యక్రమం అయిపోయాక అర్ధరాత్రి ఒంటిగంటకు తిరిగి ఇంటికి వచ్చింది.
Also Read: ఇండియాలో 26 శాతం ఉద్యోగాలు AI కారణంగా ప్రభావితం
వాళ్లు కారును ఇంటి ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయారు. ఉదయం లేచి కారును చూసి షాకయిపోయారు. దీనికి కారణం ఆ కారుపై అన్నీ గీతలే ఉన్నాయి. ఎవరైన పిల్లలు ఈ పనిచేసి ఉంటారని అతడు అనకున్నాడు. ఇది ఎలా జరిగింది అని తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాడు. చివరకి మధ్యాహ్నం తన కారుకు తగిలిన కుక్కే దానిపై గీతలు పెట్టడాన్ని చూసి షాకైపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
📍 Madhya Pradesh | #Watch: Dog's Revenge In Madhya Pradesh After Being Hit By Car Owner
— NDTV (@ndtv) January 21, 2025
Read more: https://t.co/yuaRCwr2LQ#Viral #MadhyaPradesh pic.twitter.com/hycjT406eJ
Also Read: ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు!