ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒప్పంద ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న IDBI శాఖల్లో ఖాళీల భర్తీకి తాజాగా భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 1000
పోస్టుల కేటాయింపు - యూఆర్ 451, ఎస్సీ 127, ఎస్టీ 94, ఓబీసీ 231, ఈడబ్ల్యూఎస్ 100 పోస్టులున్నాయి.
Also Read: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు
విద్యార్హత - గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ అవగాహన కలిగి ఉండాలి.
వయస్సు - 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు - ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాలి. మిగతా వారు రూ.1050 చెల్లించాలి.
Also Read: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు
దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ - ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు - ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది నెలకు రూ.29,000 జీతం అందిస్తారు. రెండో ఏడాది రూ.31,000 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి 16.11.2024 చివరితేదీగా నిర్ణయించారు.
Also Read: రేవంత్ సర్కార్ కు షాక్.. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత!
ఆన్‌లైన్ పరీక్ష తేదీ - 01.12.2024న నిర్వహించనున్నారు.
ఆన్ లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..