ఐఐటీలతో పాటు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే గేట్ 2025 పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ విడుదల చేసింది.
ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు!
GATE admit card 2025 out; exam from February 1 to 16
— Careers360 (@careers360) January 7, 2025
GATE 2025 exam will be conducted in two shifts.#GATE2025 #MTech #engineering
Read more at: https://t.co/Msq3wFcJ9t pic.twitter.com/gU6QsBEppi
ఇది కూడా చూడండి: Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో
వెబ్‌సైట్ లోకి వెళ్లి డౌన్‌లోడ్..
అభ్యర్థులు gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. గేట్ 2025 పరీక్షలు ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అని గేట్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ నిర్వహిస్తోంది.
ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్ న్యూస్.. స్టాంపింగ్ ఇక అమెరికాలోనే...
ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు మొదటి సెషన్, 2:30 గంటల నుంచి 5:30 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్షలు జరగనున్నాయి. వీటి ఫలితాలను మార్చి 19వ తేదీన విడుదల చేస్తారు.
ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని!
ఈ గేట్ స్కోర్ బట్టి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే గేట్ కోర్సు ఆధారంగా ఎంటెక్ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్ధులకు నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్‌షిప్ కూడా అందజేస్తారు. గేట్ స్కోర్ బట్టి జాతీయ స్థాయిలో ఉన్న విద్యా సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలను కల్పిస్తాయి.