/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
మెగా డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ విషయాన్ని కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు. అయితే ఈ ప్రాథమిక కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా జులై 11 లోగా https://apdsc.apcfss.in ద్వారా తెలియజేయాలని తెలిపారు. అయితే జూన్ 29వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు జరిగిన మెగా డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ కీ షీట్లును కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది
ఈ పరీక్షలకు సంబంధించి..
పీజీటీ విభాగంలో కామర్స్, ఇంగ్లిష్, హిందీ, ఫిజికల్ సైన్స్, సంస్కృతం, సోషల్, తెలుగు పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ పరీక్షల కీ, ఎస్జీటీ విభాగంలో ఎస్జీటీ జనరల్, ఎస్జీటీ (స్పెషల్ హెచ్‌హెచ్ -వినికిడి లోపం ఉన్నవారు), ఎస్జీటీ (స్పెషల్ వీహెచ్ - దృదృష్టి లోపం ఉన్నవారికి ప్రత్యేక ఎస్‌జీటీ) పరీక్షల కీ, టీజీటీ విభాగంలో ఇంగ్లిష్, హిందీ, ఫిజికల్ సైన్స్, సైన్స్ (విజ్ఞాన శాస్త్రం), సోషల్, తెలుగు పరీక్షల కీ, ఇంగ్లిష్ ప్రావీణ్యత పరీక్ష (లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్) పరీక్షల కీ, పీఈటీ- హెచ్‌హెచ్ (వినికిడి లోపం ఉన్నవారికి), పీఈటీ - వీహెచ్ (దృష్టి లోపం ఉన్నవారికి ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పరీక్షలకు సంబంధించి అన్ని మాధ్యమాల కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !
మెగా డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు.
— RTV (@RTVnewsnetwork) July 3, 2025
Read More>>https://t.co/KRwqSudRJD#MegaDSC#RTV
ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !