/rtv/media/media_files/2025/03/06/YUWhGmKHfEAorO7es452.jpg)
cisf released notification for recruitment of constable posts
CISF Recruitment 2025: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1161 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టుల్లో పురుషులకు 945, మహిళలకు 103 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 113 పోస్టులు కేటాయించారు.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 5న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1161
విభాగాల వారీగా
కుక్: 493 పోస్టులు, కాబ్లర్: 09, టైలర్: 23 పోస్టులు, బార్బర్: 199 పోస్టులు, వాషర్‌మెన్: 262 పోస్టులు, స్వీపర్: 152 పోస్టులు, కార్పెంటర్: 09 పోస్టులు, ఎలక్ట్రీషియన్: 04 పోస్టులు, మాలి: 04 పోస్టులు, వెల్డర్: 01 పోస్టు, చార్జ్ మెకానిక్: 01, ఎంపీ అటెండెంట్: 02 పోస్టులు ఉన్నాయి.
అర్హత: 10వ తరగతి లేదా తత్సమానం అర్హత సాధించి ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: పురుషులు: ఎత్తు: 170 సెం.మీ., ఛాతీ: 80-85 సెం.మీ. మహిళలు: ఎత్తు: 157 సెం.మీ. ఉండాలి.
వయోపరిమితి: 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
ఇది కూడా చూడండి: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ: 05.03.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 03.04.2025