BIG BREAKING: గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్థరాత్రి 2 గంటలకు గ్రూప్ 2 తుది ఎంపిక జాబితాను వెల్లడించింది.

New Update
APPSC

APPSC

ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్థరాత్రి 2 గంటలకు గ్రూప్ 2 తుది ఎంపిక జాబితాను వెల్లడించింది. 2023లో నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా వీటి తుది జాబితా విడుదల చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 905 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పుడు మొత్తం 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

ఇది కూడా చూడండి: Medaram Jatara : మానవజన్మఎత్తి వీరవనితలుగా నిలిచిన అడవిచుక్కలు "సమ్మక్క..సారక్క'

ఆ పోస్టులను పక్కన పెట్టి..

ఈ ఎంపిక జాబితా తయారీలో న్యాయపరమైన అంశాలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా క్రీడా కోటా రిజర్వేషన్లపై హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఎక్సైజ్ ఎస్సై, లా ఏఎస్‌ఓ పోస్టులను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. అలాగే హారిజంటల్ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పును అనుసరించి.. ప్రకటించిన 891 పోస్టుల్లో సుమారు 25 పోస్టుల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మిగిలిన 866 పోస్టుల ఎంపికలో ఎలాంటి మార్పులు ఉండవు.

ఇది కూడా చూడండి: Andhra Pradesh: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మొత్తం పోస్టుల్లో ఇంకా ప్రకటించని 14 పోస్టుల విషయంలో కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఇందులో కోర్టు ఆదేశాల వల్ల ఆపిన 2 క్రీడా కోటా పోస్టులు ఉండగా మిగిలిన 12 పోస్టులకు (7 దివ్యాంగ కోటా, 5 ఇతర రిజర్వేషన్లు) అర్హులైన అభ్యర్థులు ఎవరూ లభించలేదు. దీనివల్ల ఆ పోస్టులు భర్తీ కాలేదు. గత రెండేళ్లుగా సాగిన ఈ ప్రక్రియలో 2024 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ, 2025 ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు 2025 ఏప్రిల్‌లోనే వచ్చినప్పటికీ కోర్టు కేసుల కారణంగా తుది జాబితా విడుదల కావడానికి కొంత సమయం పట్టింది. ఈ ఫలితాల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది అభ్యర్థుల ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరింది. ఎంపికైన అభ్యర్థులు త్వరలోనే విధుల్లో చేరనున్నారు. 

ఇది కూడా చూడండి: Medaram Jatara - 2026: మేడారానికి పగిడిద్దరాజు పయనం..జాతరలో ఆయన ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు