BIG BREAKING: ఏపీలో గ్రూప్-2 వాయిదా!

గ్రూప్-2 పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేయనుంది. రోస్టర్ తప్పులపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని పరీక్షను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం సూచించింది. దీంతో పరీక్ష వాయిదాకు సంబంధించి ఈ రోజు సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

New Update
APPSC Group-2 Applications : ఏపీ గ్రూప్ - 2 దరఖాస్తుల గడువు పొడిగింపు..!!

APPSC: గ్రూప్-2 పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేయనుంది. అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని పరీక్షను వాయిదా వేయాలంటూ ప్రభుత్వ సూచించింది. దీంతో పరీక్షలను వాయిదా వేయాలని భావిస్తుండగా ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది.

కొద్ది రోజులు వాయిదా..

ఈ మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్స్ 2 మెయిన్ పరీక్షల రోస్టర్ విధానంలో తప్పులున్నాయనే అభ్యర్థుల విన్నపాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. దీంతో 23వ తేదీన నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఎపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరైనది కాదని సూచించింది. అంతేకాదు మార్చి 11న మరోసారి కోర్టులో విచారణ జగనున్న నేపథ్యంలో ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని గుర్తు చేసింది. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరింది. 

appsc grp 2
appsc grp 2 Photograph: (appsc grp 2)

 

రోస్టర్ విధానంలో లోపాలు..

ఏపీలో గ్రూప్‌ 2 నోటిఫికేషన్ వివాదాల మధ్య కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో కాలం అయింది. కానీ పరీక్ష మాత్రం వాయిదా పడుతూ వస్తుంది. అయితే గ్రూప్ 2కి సంబంధించి గతేడాదిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఇక ఈ నెల అంటే ఫిబ్రవరి 23న మెయిన్స్ నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. కానీ వివాదాలు మాత్రం సర్దుమనగలేదు. 

పోస్టు, జోనల్‌ ప్రిఫరెన్స్‌ 

ఇప్పటికీ పలువురు అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పోస్టు, జోనల్‌ ప్రిఫరెన్స్‌ తీసుకుంటామని తెలిపింది. గ్రూప్ 2 పోస్టులకు మెయిన్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత దీనికి అవకాశం ఇస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. రిజల్ట్స్ వచ్చిన అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఈ ప్రక్రియ చేపడతామని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: CM Revanth: బీసీ కులగణనపై బీజేపీ కుట్ర ఇదే.. రేవంత్ సంచలన ప్రెస్ మీట్!

మరోవైపు ఫిబ్రవరి 23న జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరుకాబోతున్నారు. ఈ పరీక్ష రెండు పూటలు జరగనుంది. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ గ్రూపు -2(Group -2) పరీక్షను నిలివేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించనున్న గ్రూప్-2 ప్రధాన పరీక్ష ప్రక్రియను నిలువరించాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను ఏపీ హైకోర్టు గురువారం కొట్టేసింది. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో విషాదం.. మరో రైతు ఆత్మహత్య

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు