/rtv/media/media_files/2025/03/14/zkFIKHZ87ZN3TTzkcj9E.jpg)
AP CM Chandrababu
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse. ap. gov. in, https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
AP Tenth Results 2025
AP SSC 10th Result at 10 AM, Get LIVE UPDATES Here: https://t.co/RxUxRLfCNW#APSSCResults #BSEAP #manabadi
— Times Now Education (@TimesNowCareers) April 23, 2025
ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. మీరు ఫలితాలు తెలుసుకోవాలంటే tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్ ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌లో కూడా తెలుసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
ఇంటర్ ఫలితాలను భట్టి విక్రమార్క విడుదల చేస్తూ.. మాట్లాడారు. ఇంటర్ పరీక్షలను మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు రాశారన్నారు. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మొత్తం 71.37 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.89 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను వారం రోజులు సమయం ఇవ్వనున్నారు. మే 22 నుంచి అడ్వాన్సడ్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఇందులో బాలికలదే పైచేయి. ఇంటర్ ఫస్టియర్‌లో 57.83 శాతం బాలురు ఉత్తీర్ణత కాగా.. 73 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు.
ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!
lokesh | tenth | ap-results | ap-tenth-results | chandrababu naidu