/rtv/media/media_files/2025/07/26/agniveer-result-2025-2025-07-26-20-14-22.jpg)
Agniveer Result 2025
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అభ్యర్థులకు అలెర్ట్. ఇటీవల జరిగిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE) ఫలితాలు ఇవాళ రిలీజ్ అయ్యాయి. ఈ రిజల్ట్స్‌ను భారత సైన్యం ఇవాళ విడుదల చేసింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు joinindianarmy.nic.inవెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ అగ్నివీర్ CEE ఎగ్జామ్స్ జూన్ 30 నుండి జూలై 10 వరకు జరిగిన విషయం తెలిసిందే.
Also Read:ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
Agniveer Result 2025
ఈ పరీక్ష 13 భాషలలో జరిగింది. అందులో ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, ఒడియా, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ మరియు అస్సామీ భాషలు ఉన్నాయి.
Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఈ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ రిజల్ట్స్ కోసం joinindianarmy.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ఆ తర్వాత హోమ్ పేజీలో ఉన్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ CEE రిజల్ట్స్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
అనంతరం లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
చివరిగా ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు.
Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ లింక్ ఒక్కో సమయంలో ఓపెన్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.