/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/48-jpg.webp)
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రూనో నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. పదేళ్ళ తమ అనుబంధానికి శాశ్వతంగా ముగింపు పలుకుతున్నాని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. టెలివిజన్ జర్నలిస్ట్ అయిన గియాంబ్రూనో.. మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విమర్శలను ఎదుర్కొన్నారు. అంతేకాదు, తోటి మహిళా ఉద్యోగితో సెక్సీయస్ట్ కామెంట్లు చేసిన విషయం బయటపడింది. అవి కూడా పచ్చి బూతులు మాట్లాడారు. అంతేకాదు తన కొలీగ్‌ను అభ్యంతరకరంగా తాకినట్టు కూడా వెలుగులోకి వచ్చింది.
బయటకు వచ్చిన వీడియోల ప్రకారం.. బూతులు మాట్లాడుతూ మహిళా సహోద్యోగి ప్రయివేట్ భాగాలకు దగ్గరగా చేతులు వేసాడు ఆండ్రియా. నిన్ను ఇంతకే ముందు నేను ఎందుకు కలవలేదు? గ్రూప్ సెక్స్‌లో పాల్గొనాలంటే నాతో కలిసి పనిచేయొచ్చని అన్నారు. ఇది మీకు తెలుసా? నాకు ఎఫైర్ ఉంది? మీడియాలో అందరికీ ఈ విషయం తెలుసు.. ఇప్పుడు మీరు కూడా వస్తారా? ముగ్గురు.. నలుగురితో చేసినట్లుగా మూడో వ్యక్తి కోసం చూస్తున్నాం.. మీరు మా వర్కింగ్ గ్రూప్‌లో భాగం కావాలనుకుంటున్నారా? లాంటి మాటలతో కొలీగ్‌ను ఆండ్రియా ఇబ్బంది పెట్టినట్టు తెలిసింది.
Also read:చిన్నారులను చిదిమేస్తున్న యుద్ధం – హృదయ విదారకంగా గాజా
అంతేకాదు ఇటలీలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటనలపై గియాంబ్రునో చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. మీరు సరదాగా గడిపేందుకు వెళ్లినప్పుడు మద్యం సేవిస్తారు. అప్పుడు అతిగా మద్యం తాగకుండా ఉంటే.. ఇబ్బందుల్లో పడరు.. అత్యాచారాన్ని నివారించాలంటే.. మీరు స్పృహ కోల్పోకుండా ఉండాలి అంటూ ఆండ్రియా గియాంబ్రునో వ్యాఖ్యలు చేశారు. వీటిపై తీవ్ర విమర్శలు రావడంతో సమర్ధించుకునేందుకు తరువాత నానాపాట్లు కూడా పడ్డారు. మద్యం తాగేందుకు, డ్రగ్స్ కోసం యువత బయటకు వెళ్ళొద్దని చెప్పడమే నా ఉద్దేశమని... చెడు వ్యక్తుల నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించానని అంటూ కవరింగ్ చేసుకున్నాడు.
అయితే ఆండ్రియా ప్రవర్తనను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మాత్రం సహించలేకపోయారు. అందుకే తమ పదేళ్ళ రిలేషన్ కు ఆమె ముగింపు పలికారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెలోనీ తన పార్టనర్‌కు థ్యాంక్స్ కూడా చెప్పారు. అతనితో ఉన్న పదేళ్ళు తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. అంతేకాదు తమ అనుబంధానికి గుర్తుగా పాపను ఇచ్చినందుకు కూడా ఆమె ఆండ్రియాకు కృతజ్ఞతలు చెప్పారు. అతనితో గడిపిన అద్బుతమైన కాలానికి, ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇక మీదట స్వస్తి అన్నారు. మా దారులు వేరయ్యాయి. అందుకే విడిపోవాలని అనుకుంటున్నాని స్పష్టం చేశారు. అంతేకాదు ఆండ్రియా వ్యాఖ్యలకు తాను బాధ్యరాలిని కాదని భవిష్యత్తులో కూడా అతనికి సంబంధించిన ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వనని తేల్చి చెప్పారు.
La mia relazione con Andrea Giambruno, durata quasi dieci anni, finisce qui. Lo ringrazio per gli anni splendidi che abbiamo trascorso insieme, per le difficoltà che abbiamo attraversato, e per avermi regalato la cosa più importante della mia vita, che è nostra figlia Ginevra.… pic.twitter.com/1IpvfN8MgA
— Giorgia Meloni (@GiorgiaMeloni) October 20, 2023