International: ప్రపంచాధినేతలను నమస్తేతో ఇటలీ ప్రధాని పలకరింపు..
ఇటలీలో జీ7 సమ్మిట్ జరుగుతోంది. జూన్ 13, 14 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు ప్రపంచాధినేతలు ఇటలీకి చేరుకున్నారు. వీరందరినీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.