నష్టాలతో మొదలయి..నష్టాలతోనే ముగిసింది

దేశీయ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలతో ముగిసాయి. ఫెడ్ రేటు నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో మార్కెట్లు రోజంతా నష్టాలతోనే కొనసాగింది.

New Update
Stock Market Today:నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు

రెండు రోజుల నుంచీ స్టాక్ మార్కెట్లు డౌన్ ట్రెండ్ లో నడుస్తున్నాయి.  మూడో రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఈరోజు ఉదయం నష్టాలతో మొదలైన దేశీయ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి నష్టాలతోనే ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాల ప్రభావం ఈరోజు మార్కెట్ మీద బాగా చూపించింది. దానికి తోడు అందరూ ఊహించినట్టుగానే ఫైడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. మరోవైపు కెనడా-భారత్ సంబంధాలు చెడిపోవడం కూడా మర్కెట్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీంతో నిఫ్టీ సూచి సెప్టెంబర్ 7నాటి కనిష్టానికి పడిపోయింది. దీంతో ఈరోజు ఉదయం ఆరంభం అవడమే నష్టాలతో ఆరంభం అయింది. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 315 పాయింట్ల నష్టంతో 66, 484 ట్రేడ్ అయింది. నిఫ్టీ 90 పాయింట్లు నష్టపోయి 19, 810 దగ్గర కొనసాగింది.

రోజంతా ఈ డౌన్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఒక దశలో సెన్సెక్స్ 620 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 19, 730 కి చేరుకుంది. చివరకు డే ఎండ్ కు వచ్చేసరికి సెన్సెక్స్ 371 పాయింట్లకు కుప్పకూలి 66, 230 దగ్గర, నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 19, 472 దగ్గరా ముగిసాయి. ఆటో, బ్యాంక్, ఫార్మా సూచీలతో పాటూ దాదాపు అన్ని రంగాల్లో షేర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. బ్యాంకింగ్ షేర్ల నష్టాలతో అయితే నిఫ్టీ బ్యాంకు దాదాపు 2శాతం నష్టపోయింది.  కెనడాలో భారత్ వీసా సర్వీసులను రద్దుచేయడంతో బీఎల్ఎస్ షేరు 2.43 శాతం నష్టపోయి 263.40 దగ్గర ముగిసింది. ఒక్క మీడియా తప్ప నిఫ్టీలోని దాదాపు అన్ని రంగాల సూచీలు ఈరోజు నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఎంఅండ్ ఎం, సిప్లా, మోటో కార్ప్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. మరోవైపు అదానీ పోర్ట్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, డా. రెడ్డీస్, బీపీసీఎల్ మాత్రం లాభపడ్డాయి.

today stock market closing with huge lossese. publive-image

ఫెడ్ వడ్డీ రేట్లు యధాతథంగా ఉంచడంతో డాలర్ రేటు పెరిగింది. దీనివల్ల రూపాయి విలువ స్వల్పంగా నష్టపోతోంది. బుధవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 83.07 దగ్గర ఉంటే ఈరోజు స్వల్పంగా నష్టపోయి 83.09 దగ్గర ముగిసింది.  ఇది ఆయిల్ రేట్లను విపరీతంగా పెంచితే...బంగారం, వెండి రేట్లను మాత్రం తగ్గించింది. బంగారం ధర దాదాపు 150రూ. తగ్గింది.

Advertisment
తాజా కథనాలు