ISRO: మీరు కన్న కలలే నిజం అవుతాయ్ చూడు..!! చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అడుగు వేయబోతోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడాన్ని సెలబ్రెట్ చేసుకుంటూనే మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈసారి ఏకంగా సూర్యుడు, శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపై పరిశోధలను జరుపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. By Bhoomi 24 Aug 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ISRO Chairman Somanath : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో కూడా ఇస్రో ఇదేవిధంగా 'మార్స్' (Mars)పైకి దిగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు 'మా కళ్ళు ఇప్పుడు 'మార్స్' పైనే ఉన్నాయని సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయం తరతరాలుగా ఇస్రో నాయకత్వం, శాస్త్రవేత్తల కృషి ఫలితమన్నారు. కాగా ఆదిత్య ఎల్ 1 పేరుతో సన్ మిషన్ ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు. సెప్టెంబర్ మొదటివారంలో ఆదిత్య ఎల్-1ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదిత్య ఎల్ 1 (Aditya L 1)ఇస్రో సన్ మిషన్ ప్రయోగంతో కరోనాగ్రఫీ స్పేస్ క్రాఫ్ట్ (Coronagraphy Spacecraft) ను భూమికి సూర్యుడికి మధ్య ఉన్న ఎల్ 1 పాయింట్ చుట్టూ ఉండే ఒక హాలో ఆర్బిట్ లో చొప్పిస్తారు. సౌర అయస్కాంత తుఫానులు, సౌరవాతావరణం, భూమి చుట్టున్న పర్యావరణంపై దాని ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేయనుంది. కాగా ఇస్రో ఈ స్పేస్ క్రాఫ్ట్ ను దేశంలో పలు పరిశోధన సంస్థల సహకారంతో తయారు చేసింది. PSLV-XL(C57)ద్వారా షార్ శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఐదేళ్లపాటు లక్ష్యంగా ఆదిత్య ఎల్ 1సన్ మిషన్ కొనసాగించాలని ఇస్రో భావిస్తోంది. అటు ఈ విజయం (Chandrayaan-3 Mission) చంద్రుని మిషన్‌పై మాత్రమే కాకుండా అంగారక గ్రహాంపైకి వెళ్లేందుకు మరింత విశ్వాసం పెరిగిందని సోమనాథ్ అన్నారు. అంగారక గ్రహంపై సాఫ్ట్ ల్యాండింగ్ ఉంటుందని భవిష్యత్తులో ఈ ప్రయత్నం శుక్రుడు, ఇతర గ్రహాలపై కాలుమోపనున్నట్లు తెలిపారు. చంద్రయాన్-2 కోసం పనిచేసిన ముఖ్యమైన శాస్త్రవేత్తలు కూడా చంద్రయాన్-3 బృందంలో భాగమేనని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-2లో ఉన్న చాలా మంది మనతోనే ఉన్నారని, చంద్రయాన్-3లో మాకు సహాయం చేస్తున్నారని ఆయన అన్నారు. అందులో భాగమైన వారు చాలా సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. ఇది ప్రపంచ స్థాయి పరికరాలతో కూడిన పూర్తి 'మేక్ ఇన్ ఇండియా' (Make in India)మిషన్ అని సోమనాథ్ సూచించారు. Also Read: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ పది విషయాలు తెలుసుకోవల్సిందే..!! #chandrayaan-3 #isro #mars #aditya-l-1 #isro-chairman-somanath #isro-mission-on-moon #isro-mission-on-venus #isro-mission-on-mars #isro-next-project-on-mars #isro-next-project-on-moon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి