ISRO: మీరు కన్న కలలే నిజం అవుతాయ్ చూడు..!!
చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అడుగు వేయబోతోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడాన్ని సెలబ్రెట్ చేసుకుంటూనే మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈసారి ఏకంగా సూర్యుడు, శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపై పరిశోధలను జరుపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు.