GAZA: గాజాలో మళ్ళీ యుద్ధం..దాదాపు 200 మంది మృతి

గాజాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సెంట్రల్‌ గాజాలో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకరపోరు సాగుతోంది. ఇందులో దాదాపు 200 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 400మంది దాకా గాయపడ్డారని సమాచారం.

New Update
GAZA: గాజాలో మళ్ళీ యుద్ధం..దాదాపు 200 మంది మృతి

Israel Attacked Again on Gaza: ఇజ్రాయెల్ సైన్యాలు హఠాత్తుగా మళ్ళీ విరుచుకుపడుతున్నాయి. సెంట్రల్ గాజా అయిన నుస్రుత్ శిబిరానికి తూర్పు , వాయువ్య ప్రాంతాలలోకి ప్రవేశించి, శిబిరంలోని పెద్ద భాగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి. డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్నాయి. ఇందులో డెయిర్‌ అల్‌ బలాహ్‌లోని అల్‌–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ పేర్కొంది. ఈ దాడిలో 200మంది చనిపోయారు. మరో 400మంది దాకా గాయపడ్డారు. చనిపోయిన వారిలో చాలా మంది చిన్నారులు ఉన్నారు.

గాజాలో (Gaza) దాడులు ఆపాలని ఐక్యరాజ్యసమితి ఎప్పుడో చెప్పింది. తక్షణమే కాల్పుల విరమణ చేయాలని మండలి తీర్మానం చేసింది. అయినా ఇజ్రాయెల్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. మళ్ళీ మళ్ళీ దాడులు చేస్తూనే ఉంది. హమాస్‌కు, ఇజ్రెయెల్‌కు మధ్య జరుగుతున్న ఈ వార్‌లో పాలస్తీనీయులు ఇప్పటికే వేలల్లో చనిపోయారు. ఇప్పటివరకు 36,800మంది పాలస్తీనియన్లు మరణించారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు కలిపి సుమారు 83,700 మంది గాయపడ్డారు. మరోవైపు యుద్ధం కారణంగా గాజాలో చాలా దయనీయమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆహారం, స్వచ్ఛమైన నీరు, గాలి దొరకక పాలస్తీనియన్లు అల్లల్లాడుతున్నారు. దాదాపు గాజా అంతా శ్మశానంలా తయారయింది.

మరోవైపు ఇజ్రాయెల్ దాడుల తరువాత హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న మరో నలుగురు ఖైదీలు బయటకు వచ్చారు. ఇజ్రాయెల్ నిన్న ఉదయం జరిపిన ఆపరేషన్‌లో ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్‌ మెయిర్‌ జాన్‌(21), ఆండ్రీ కొజ్లోవ్‌(27), ష్లోమి జివ్‌(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది.

Also Read:Chandrababu:చంద్రబాబు ప్రమాణ స్వీకారం టైమ్ మారలేదు…అంతా అవాస్తవం

Advertisment
Advertisment
తాజా కథనాలు