Israel -Iran: ముదురుతున్న ఇజ్రాయెల్ -ఇరాన్‌ ఘర్షణలు.. మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా !

ఇరాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ చేసిన దాడికి తప్పనిసరిగా బదులిస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండగా.. ఇరాన్‌కు రష్యా సపోర్ట్ చేస్తామంటోంది.

New Update
Israel -Iran: ముదురుతున్న ఇజ్రాయెల్ -ఇరాన్‌ ఘర్షణలు.. మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా !

Israel-Iran conflict: ఇజ్రాయెల్ - ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఇజ్రాయెల్ చేసిన పనే అని భావించిన ఇరాన్‌.. ప్రతీకారం తీర్చుకునేందుకు అనుకున్నట్లుగానే డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. వాటిల్లో కొన్ని మాత్రమే తమ భూభాగాన్ని తాకినట్లు పేర్కొంది. ఇరాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా కూల్చేశామని పేర్కొంది. అయితే ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌ ప్రాంతంలో ఐడీఎఫ్‌ స్థావరం తీవ్రంగా దెబ్బతింది.

Also Read: ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటాం: బైడెన్

అలాగే ఇరాన్‌ డ్రోన్ల కూల్చివేతలో ఇజ్రాయెల్‌కు అమెరికా సైన్యం సాయం చేసింది. మధ్యదరా సముద్రంలో 70కి పైగా డ్రోన్లు కూల్చివేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు తాము ఇనుప కవచంలా రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఇరాన్‌ చేసిన దాడిపై సమన్వయంతో దౌత్యమార్గంలో స్పందించేలా జీ7 దేశాలను ఒప్పిస్తానని.. త్వరలోనే ఈ దేశాలతో సమావేశమవుతామని పేర్కొన్నారు. ఇరాన్ చేసిన దాడికి తప్పనిసరిగా బదులిస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ లేదా అమెరికా తమపై ప్రతీకార చర్యలకు దిగితే.. తాము తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. దీంతో ఇరాన్ - ఇజ్రాయెల్‌ మధ్య మరింత భీకర పరిస్థితులు చెలరేగుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం మొదవుతుందా అనే ఆందోళన నెలకొంది.

ఇప్పటికే అనేక దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్‌లకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. తాము ఇరాన్‌కు సపోర్ట్ చేస్తామంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై క్షిపణులు దూసుకొచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇరాన్ 300 క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయగా.. ఐదుగంటల్లోనే 99 శాతం మిస్సైల్స్, డ్రోన్లను ఇజ్రాయెల్‌ ఐరన్ డోమ్ అడ్డుకుందని.. ఎలాంటి నష్టం జరగలేదని.. ఇది ఇజ్రాయెల్ విజయమని ఓ వ్యక్తి పోస్టు చేశాడు. మరోవైపు ఇజ్రాయెల్‌పై దాడిచేసినందుకు.. ఇరాన్‌ పార్లమెంటులోని సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే డెత్‌ టూ ఇజ్రాయెల్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also read: ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి దిగిన ఇరాన్

Also read: ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి దిగిన ఇరాన్

Advertisment
తాజా కథనాలు