Israel-Hamas Conflict:మొదలైన ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్..ఇక ఏరిపారేయడమే గాజాలో ఇజ్రాయెల్ బలగాలు అడుగుపెట్టేసాయి. హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు గ్రౌండ్ ఆపరేషన్ రెడీ అయిపోయింది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం భూ దాడులు చేయడం మొదలుపెట్టేసింది. హమాస్ మిలిటెంట్ల దగ్గర ఉన్న తమ బందీలను విడిపించేందుకే ఈ ఆపరేషన్ ను చేస్తున్నామని చెబుతోందది ఇజ్రాయెల్ సైన్యం. By Manogna alamuru 14 Oct 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తమ దేశ బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టేసింది. నిన్నటి వరకు వైమానికి దాడులు మాత్రమే చేసిన ఇజ్రాయెల్ ఈరోజు భూభాగంలో కూడా అడుగు పెట్టేసింది. దీని కోసం ముందుగానే 24గంటల్లోగా ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని పాలస్తీనియన్లకు వార్నింగ్ ఇచ్చింది. దీని ప్రకారం పాలస్తీనియన్లు ఇళ్లు ఖాళీ చేసి దక్షిణ గాజా ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. అయితే ఈ గ్రౌండ్ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ సైన్యం చాలా చిక్కులనే ఎదుర్కొనవలసి ఉంటుంది. గాజా చాలా సిటీ. ఇరుకు సందులతో, భవనాలతో నిండి ఉంటుంది. ఇలాంటి చోటకు సైన్యం వెళ్ళగలుగుతుంది కానీ భారీ ఆయుదాలు, ట్యాంకులు లాంటివి వెళ్ళలేవు. ఇక్కడ ఇళ్ళు కూడా గజిబిజిగా పజిల్స్ లా ఉంటాయి. హమాస్‌కు అలవాటు అయిన ప్రాంత కాబట్టి ఇజ్రాయెల్ సైన్యం చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా మిలిటెంట్లు ఎదురుపడి దాడి చేయవచ్చును. 2014లో ఇలాగే జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి తోడు గాజా అంతా టన్నెల్సే ఉంటాయి. హమాస్ రహస్య స్థావరాలు ఇవే. వీటి ద్వారా తమ బలగాలను, ఆయుధాలను వారు ఈజీగా తరలించుకుంటారు. అంతేకాదు మెరుపు దాడులు చేయడానికి కూడా టన్నెల్స్ ను ఉపయోగించుకుంటారు. మరోవైపు ఇంతకు ముందు కన్నా హమాస్ మిలిటెంట్లు బలంగా ఉన్నారు. వీరి దగ్గర చాలా అధునాతన ఆయుదాలు ఉన్నాయి. మ్యాన్ పాడ్, డ్రోన్ల వంటి వాటితో ఇజ్రాయెల్ సైన్యాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడమే కాక దాడికి కూడా దిగుతుంది. మ్యాన్ ప్యాడ్స్‌తో చాలా తక్కువ ఎత్తు ఎగిరే విమానాలను దెబ్బతీయవచ్చును. దీనికి తోడు చిన్న చిన్న రాకెట్లను, మోర్టార్లను హమాస్ సమకూర్చుకుంది. వీటితోనే వారం క్రితం కేవలం 3గంటల సమయంలో ఇజ్రాయెల్ మీద 4500 రాకెట్లను ప్రయోగించింది. ఇక డ్రోన్ల విషయానికి వస్తే ఇవి హమాస్ కు సరికొత్త బలాన్ని ఇచ్చేవి. వీటి ద్వారా చిన్న చిన్న ఇరుకు సందుల్లో కూడా బాంబులను వేయొచ్చు. అలాగే బారీ డ్రోన్లు కూడా తమ దగ్గర ఉన్నాయని హమాస్ ప్రకటించింది. ఇక ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అయితే చెప్పింది కానీ 24 గంటల్లో 10 లక్సల మంది ప్రజలు మొత్తం జాగాను ఖాళీ చేయడం చాలా కష్టం. ప్రజలు ఉంటుండగా ఇజ్రాయెల్ సైన్యం అటాక్స్ ఎక్కువగా చేయలేదు. దానికి తోడు పాలస్తీనాకు తోడుగా ఇరాన్, సిరియా, లెబనాన్ దేవాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ మీద దాడికి ఈ దేవాలు ఎప్పుడూ సిద్దంగా ఉంటాయి. ఒకవేళ ఇజ్రాయెల్ గ్రౌండ్ దాడి తీవ్రం అయిందని తెలిస్తే మూడు దేశాలు ఒకేసారి దాడి చేస్తాయి. అప్పుడు ఇజ్రాయెల్ సైన్యానికి అటాక్ చేయడం మరింత కష్టతరం అయిపోతుంది. Also Read:ఆపరేషన్ అజయ్-ఢిల్లీకి చేరుకున్న 235మంది భారతీయులు #attack #militants #hamas #gaza #isreal #force మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి