ISREAL, PALESTHINA WAR:ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుధ్ధమేఘాలు

పాలస్తీనా మీద యుద్ధాన్ని ప్రకటించింది. పాలస్తీనా మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లతో అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇంకా పాలస్తీనా ఎటాక్ లో ఇజ్రాయెల్ కు చెందిన 70 ఏళ్ళ మహిళ మృతి చెందింది.

New Update
ISREAL, PALESTHINA WAR:ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుధ్ధమేఘాలు

పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబాటు చేసి శనివారం తెల్లవారుజామున డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించడంతో ఒక మహిళ మరణించినట్లు AFP వార్తా సంస్థ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్ఫడ్డాయి. పాలస్తీనాకా చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగడంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. దీంతో ఇజ్రాయెల్ యుద్ధం అనివార్యం అంటూ ప్రకటన చేసింది.

పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలెం, టెల్ అవివ్ సహా దేశ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేల రాకెట్లు ఇజ్రాయెల్ మీద పడ్డాయి. దీనివల్ల అక్కడ పలు ప్రాంతాల్లో బాంబులు పేలాయి. అది జరిగిన కొంతసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్్లోకి చొచ్చుకుని వచ్చారు. ఇది ఇజ్రాయెల్ ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. సరిహద్దుల్లో ఉన్న ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు రాకూడదని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది.

ఆపరేషన్ ఆల్ అక్సా స్ట్రామ్....

ఇజ్రాయెల్ మీద కొత్త ఆపరేషన్ను ప్రారంభించామని పాలస్తీనా హమాస్ మిలటరీ వింగ్ హెడ్ మొహ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ఆపరేషన్ ఆల్ అక్సా స్ట్రామ్ పేరుతో అటాక్ చేస్తామని చెప్పాడు. ఇప్పటికే 5 వేల రాకెట్లను ప్రయోగించామని తెలిపాడు. డెయిఫ్ ప్రకటనతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాల మీద ఎదురు దాడి చేసింది. పాలస్తీనా రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్ ఢిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. దీంతో అక్కడి ప్రాంతమంతా బాంబు పేలుళ్ళతో నిండిపోయింది. రెండు దేశాల మధ్య యుద్ధంతో సరిహద్దుల్లో ఉన్న చాలా మంది సామాన్య ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. బాంబు పేలుళ్ళల్లో ఇప్పటికే చాలామంది చనిపోయుంటారని అంచనా.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం...

యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు.మరోవైపు, పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అంటూ, యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.1967 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే కోరికతో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.

Also Read:వంద పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు