Iran- Israel War : ఇరాన్ రక్షణ వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడులు.. ఉద్రిక్త పరిస్థితులు!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్ మరింత భీకరంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థ దెబ్బతినట్లు తెలుస్తోంది. శాటిలైట్ పంపిన ఫొటోల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందంటూ పలు నివేదికలు వెల్లడించాయి. ఈ వార్తలను ఇరాన్‌ ఖండిస్తోంది.

New Update
Iran- Israel War : ఇరాన్ రక్షణ వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడులు.. ఉద్రిక్త పరిస్థితులు!

Iran Vs Israel : పశ్చిమాసియా(West Asia) లో కొన్ని రోజులుగా హైటెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే. కాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్(Iran-Israel War) మరింత భీకరంగా మారుతోంది. ఒకవైపు హమాస్(Hamas) పై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు ఇరాన్ పై కూడా బలంగా ఎదురుదాడి చేస్తోంది. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే భారీ నష్టం వాటిల్లగా.. ఇరాన్‌- ఇజ్రాయెల్ మధ్య కవ్వింపు చర్యలు మరింత పెరిగిపోవడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతోంది.

ఇరాన్ రక్షణ వ్యవస్థ దెబ్బతినట్లు వార్తలు..
ఈ క్రమంలోనే ఇంటర్నేషన్ మీడియా వెల్లడించిన నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థ దెబ్బతినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాల్లో ఇదే విషయం స్పష్టమైందంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం వెల్లడించింది. అయితే ఈ వార్తలను ఇరాన్‌ మాత్రం ఖండిస్తోంది. అసలు తాము వైమానిక వ్యవస్థనే యాక్టివేట్ చేయలేదని చెబుతోంది. 2016లో ఇరాన్‌కు S-300 ఎయిర్‌ ఢిపెన్స్‌ సిస్టమ్‌న్ పంపిణీ చేసింది రష్యా. అయితే ఈ దాడుల్లో ఇరాన్‌ తమపై ప్రయోగించిన క్షిపణికి సంబంధించిన కొన్ని భాగాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Amit Shah : రిజర్వేషన్లు రద్దు… అమిత్ షా హాట్ కామెంట్స్

మళ్లీ ప్రతీకార దాడులు తప్పవంటూ సంకేతాలు..
ఇదిలావుంటే.. ఇరాన్-ఇజ్రాయెల్ నేతలు మళ్లీ ప్రతీకార దాడులు తప్పవంటూ సంకేతాలు పంపుతున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎంతకైనా తెగిస్తామంటూ సవాల్ విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడం ఆపట్లేదు. అంతేకాదు తాజాగా దాడుల దృశ్యాలను ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ రిలీజ్ చేయడం విశేషం. అలాగే రఫాపై దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్‌ తెలిపింది. దీన్ని తాము పరిశీలిస్తున్నామని, త్వరలోనే స్పందన తెలుపుతామని శనివారం పేర్కొంది. ఇజ్రాయెల్‌ ప్రతిపాదనలోని అంశాలను మాత్రం హమాస్‌ సీనియర్‌ నేత ఖలీల్‌ అల్‌ హయ్యా వెల్లడించలేదు. ఈ నెల 13న ఈజిప్టులో జరిగిన చర్చల్లో 40 మంది ఇజ్రాయెలీ బందీల విడుదల, ఇందుకు ప్రతిగా వందలాది మంది పాలస్తీనియన్‌ ఖైదీలను విడిచే పెట్టే అంశం తెరపైకి వచ్చింది. తాజా ప్రతిపాదనలో బందీల సంఖ్య 33కి తగ్గిందన్న వార్తలు వస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు