Poonam Pandey: పూనమ్ పాండే నిజంగానే చనిపోయిందా..!! బాలీవుడ్ నటి పూనమ్ పాండే.. మరణించినట్లు ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో ప్రకటించడం ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ పూనమ్ నిజంగానే మరణించారా లేదా అనే దానిపై అనుమానం వ్యక్తమవుతోంది. By B Aravind 02 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Poonam Pandey Death: బాలీవుడ్ నటి పూనమ్ పాండే (32) మరణించినట్లుగా వార్తలు రావడం సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. పూనమ్ పాండే మరణించినట్లుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనే తన మేనేజర్ నిఖిత శర్మ వెల్లడించారు. ఆమె సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్ (Cervical Cancer) బారినపడటంతో కన్నుమూసినట్లు తెలిపారు. అసలు ఇంతకీ పూనమ్ పాండే నిజంగానే మరణించారా లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ (Publicity Stunt) కోసమే ఇలా చేసినట్లు కొందరు నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే నిన్న (గురువారం) పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ (Budget 2024) ప్రకటనలో 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న బాలికల కోసం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. కేంద్రమంత్రి అలా ప్రకటించిన మరుసటి రోజే పూనమ్ చనిపోయనట్లు మరణవార్తలు రావడం గమనార్హం. సడన్‌గా ఎలా ? అయితే మొన్నటివరకు కూడా షూటింగ్‌లలో పాల్గొన్న పూనమ్ పాండే (Poonam Pandey) ఇలా సడెన్‌గా మృతిచెందినట్లు ఆమె మేనేజర్ ప్రకటించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. సాధారణంగా క్యాన్సర్ చివరి స్టేజ్‌లో ఉన్నప్పుడు రోగి బలహీనంగా అయిపోతారు. కానీ మొన్నటివరకు కూడా యాక్టివ్‌గా ఉన్న పూమన్‌కు ఇలాంటి పరిస్థితి ఎలా రావడం చర్చనీయాంశమవుతోంది. అయితే పూనమ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. పూనమ్ మరణ వార్త విషయాన్ని ఆమె పీఆర్ టీమ్ మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని వారు వెల్లడించారు. ఇదిలాఉండగా.. పూనమ్ పాండే ఎప్పుడూ కాంట్రవర్సీలకు సంబంధించి నిత్యం వార్తల్లో వస్తూనే ఉంటుంది. ఆమె చేసే ఫోటో షూట్లు, షేర్ చేసే వీడియోలు కూడా అశ్లీలంగా ఉంటాయి. అంతేకాదు ఆమె ఓ సపరేట్ యాప్ ద్వారా కూడా తన అందాలను చూపిస్తోంటుంది. కాంట్రవర్సీలతో ఫేమస్ అయిన పూనమ్ పూనమ్ పాండే బాలివూడ్‌లో ఒక ప్రముఖ మోడల్‌గా గుర్తింపు పొందారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు ఒక వీడియో సందేశంలో భారత్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే తన బట్టలు విప్పేస్తానని ప్రకటన చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. 2013లో 'నాషా' అనే చిత్రంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూనమ్ తెలుగులో 'మాలిని అండ్ కో' అనే చిత్రంలో నటించింది. ఆమె తాను చేసిన సినిమాలకంటే కంట్రవర్సిలతోనే ఎక్కువగా వార్తల్లో కనిపించారు. పూనమ్ ఢిల్లీలో పుట్టి అక్కడే స్కూల్ ఎడ్యూకేషన్ పూర్తి చేసింది. ఇంటర్ తర్వాత మోడలింగ్‌ను కెరియగ్‌గా ఎంచుకుంది. ఇక 2010లో గ్లాడ్‌రాక్స్ అనే పత్రిక నిర్వహించిన అందాల భామలో పోటీలో తొలి 8 మందిలో ఆమె నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పాపులారిటీ రావడంతో.. ఎక్కువగా అర్ధనగ్న ఫొటోలు షేర్ చేస్తూ ఉండేంది. అంతేకాదు తన వైవాహిక జీవితంలో ఎన్నో గొడవలు జరిగాయి. తనను భర్త శారీరకంగా హింసిస్తున్నాడంటూ అప్పట్లో ఆమె పోలీసులను ఆశ్రయించి ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటినుంచి పూనమ్ సింగిల్‌గానే ఉంటోంది. కానీ తాజాగా ఆమె మరణించినట్లు వార్త రావడంతో తన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. Also Read: ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇండస్ట్రీలో భారీగా ఉద్యోగాలు.. బడ్జెట్ కూడా అదే చెబుతోంది #cervical-cancer #poonam-pandey-death #poonam-pandey #national-news #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి