Andhra Pradesh : తమ్ముడి కోసం అన్న..ఆరోజు నుంచే చిరంజీవి ప్రచారం?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా 15 రోజుల మాత్రమే టైమ్ ఉంది. ప్రధాన పార్టీలు అన్నీ ఇప్పటికే ముమ్మురంగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి ఒకరి మీద ఒకరు పోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తమ్ముడి కోసం అన్న చిరంజీవి ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

New Update
Andhra Pradesh : తమ్ముడి కోసం అన్న..ఆరోజు నుంచే చిరంజీవి ప్రచారం?

Chiranjeevi Election Campaign : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో ఎన్నికల హీట్ బాగా రాజుకుంది. అధికా పార్టీ, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా ప్రచారాలు సాగుఉతన్నాయి. ఒకరి మీద ఒకరు మాట తూటాలు పేల్చుకుంటున్నారు. దాంతో పాటూ టీడీపీ(TDP), బీజేపీ(BJP) లతో కలిసి బరిలోకి దుగుతున్న జనసేన(Janasena) మీద కూడా అందరి దృష్టీ ఉంది. ఈ సారి అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి ఎలా అయినా గెలవాలని అనుకుంటున్నారు. పవన్ పోటీ చేసే పిఠాపురంలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

రంగంలోకి దిగుతున్న అన్న?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తే. అయితే తర్వాత వాటన్నింటికీ దూరంగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా తమ్ముడు పవన్ కల్యాణ్ పోటీ చేసినా కామ్‌గానే ఉండిపోయారు. అయితే ఈసారి మాత్రం అలా జరగదు అని చెబుతున్నారు. తమ్ముడి కోసం అన్న రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. ఈ సారి ఎలా అయినా పిఠాపురం నుంచి పవన్‌ను గెలిపించాలని అన్న చిరంజీవి అనుకుంటున్నారుట. ఇప్పటికే జనసేన పార్టీకి చిరంజీవి ఐదు కోట్లు విరాళం ఇచ్చారు. దాంతో పాటూ అదే పార్టీ నాయకుడు అయిన సీఎం రమేష్‌ను గెలిపించాలని కోరుతూ మాట్లాడారు కూడా. ఇప్పుడు ఏకంగా తమ్ముడు కోసం ప్రచారం చేయడానికి వస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో పవన్ లక్యాణ్ గెలిచేలా ప్రచారం చేస్తారని చెబుతున్నారు.

ఆరోజు నుంచే మొదలు?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా విశ్వంభరతో బిజీగా ఉన్నారు. అయినా..దాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టి పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మే 5వ తేదీ నుంచి ప్రచారానికి వస్తారని చెబుతున్నారు జనసైనికులు. దీనికి సంబంధించి పవనిజం హాలిక్స్ అనే అకౌంట్‌లో పోస్ట్ టకూడా పెట్టారు. మే 5 నుంచి 11 వరకు జనసేన తరుఫున చిరంజీవి ప్రచారం చేస్తారని చెబుతున్నారు. చిరంజీవి అదరగొట్టేస్తారని చెప్పుకొచ్చారు.  అయితే ఇప్పటి దాకా ఈ విషయం ఎక్కడా అఫీషియల్ బయటకు రాలేదు. దీని గురించి చిరంజీవి కానీ, పవన్ కల్యాణ్ కానీ...జనసేన నాయకులు ఎవరూ కానీ రెస్పాండ్ అవ్వలేదు. చిరంజీవి ప్రచారం గురించి ఎక్కడా చూచాయగా కూడా ప్రస్తావన తీసుకురాలేదు.

Also Read:IPL-2024: ఏంటో ఈ ఐపీఎల్..అంతా తారుమారు అవుతోంది

Advertisment
తాజా కథనాలు