Hamad-Israel : ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక

గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాసలో యూఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీన్ని అమెరికా తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తున్నంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుందని.. ఊహించని, నియంత్రించని పరిణామాలు చోటుచేసుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది.

Hamad-Israel : ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక
New Update

America-Iran Warning : ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. కొన్ని రోజుల క్రితమే కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు బంధీలను విడుదల చేశాయి. ఆ తర్వాత మళ్లీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐక్యరాజ్యసమితిలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) తీర్మానాన్ని ప్రతిపాదించింది. కానీ దీన్ని అమెరికా వీటో అధికారంతో తిరస్కరించింది. అమెరికా దీనికి ఒప్పుకోకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఇరాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా(America) మద్దితిస్తున్నంత వరకు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుదని.. దీనివల్ల పశ్చిమాసియాలో భవిష్యత్తులో ఊహించని, నియంత్రించలేని పరిణామాలు చోటుచేసుకుంటాయని.. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుస్సేన్‌ అమిర్‌ అబ్దుల్లాహియన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: బస్సు ఫ్రీ అని భార్యలు ఊర్లు తిరిగితే.. భర్తలంతా బార్లకే.. ఫన్నీ మీమ్స్ వైరల్

ఈ విషయాన్ని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్‌కు కూడా ఫోన్ చేసిన చెప్పినట్లు కూడా ఇరాన్ తెలిపింది. యూఎన్ ఛార్టర్‌లో ఆర్టికల్‌ 99ను ప్రయోగించి భద్రతామండలి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఆంటోనియో గుటెరస్‌ను హుస్సేన్‌ అమిర్‌ అభినందనలు తెలిపారు. ఇటీవల బందీల విడుదలకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇటీవల తాత్కాలిక కాల్పుల విరమణ జరగగా.. ఈ ఒప్పందాన్ని పొడగించాలని చాలా దేశాలు కోరాయి. అయితే ఈ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ డిసెంబర్ 1 నుంచి ఇజ్రాయెల్ కాల్పులను తీవ్రతరం చేసింది. అయితే దీనిపై కూడా స్పందించిన హుస్సేన్ అమిర్ కీలక వ్యాఖ్యాలు చేశాడు. ఒప్పందాన్ని హమాస్ అతిక్రమించిందని ఇజ్రాయెల్‌ చెప్పడం అవాస్తవమని.. కేవలం అమెరికా ఇచ్చిన మద్దతు వల్లే కాల్పులు మళ్లీ మొదలయ్యాయని హుస్సేన్ ఐరాసకు తెలిపారు. అయితే యూఏఈ ప్రవేశపెట్టిన తీర్మానం వాస్తవికతకు దూరంగా ఉందని.. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదని అమెరికా అభిప్రాయపడింది. ముసాయిదాలో సవరణలు చేయాలని సూచనల చేసింది. అలాగే అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిని కూడా ఖండించాలంటూ డిమాండ్ చేసింది.

Also Read: రైతు బంధు డబ్బు జమ అప్పుడే.. మంత్రి ప్రకటన!

#united-nations #hamas-vs-israel #hamas-israel-war #gaza #telugu-news #iran #america
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి