Zuckerberg: పాకిస్థాన్‌లో జుకర్‌ బర్గ్‌కు మరణశిక్ష.. స్వయంగా వెల్లడించిన మెటా సీఈఓ!

మెటా సీఈఓ జుకర్‌ బర్గ్‌ ఓ సంచలన అంశంతో వార్తల్లో నిలిచారు. దేవుడి గురించి ఎవరో ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్టు పెట్టిన కారణంగా తనకు పాకిస్థాన్‌ మరణశిక్ష విధించాలని చూస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ దేశానికి వెళ్లాలని మాత్రం లేదన్నారు. 

New Update
Zuckerberg:

Zuckerberg: Photograph: (Zuckerberg:)

Zuckerberg: మెటా సీఈఓ జుకర్‌ బర్గ్‌ ఓ సంచలన అంశంతో వార్తల్లో నిలిచారు. తనగురించి ఎవరో ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు కారణంగా తనకు పాకిస్థాన్‌ మరణశిక్ష విధించాలని చూస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రీసెంట్ గా జో రోగన్‌ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్.. పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్‌ సంస్థపై నమోదైన కేసు గురించి వివరించారు. ఫేస్‌బుక్‌లో దేవుడి గురించి తప్పుగా పోస్ట్ పెట్టారని, దీంతో దేవుడినే అవమానిస్తున్నట్లు తనపై ట్రోలింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. 

నాకు మరణశిక్ష..

‘ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కోలా చట్టాలుంటాయి. అందులో కొన్ని మనం అంగీకరించనివి కూడా ఉంటాయి. ఫేస్‌బుక్‌లో దేవుడిని అవమానిస్తూ ఉన్న చిత్రాలను ఎవరో పోస్టు చేయగా పాకిస్థాన్‌లో నాకు మరణశిక్ష విధించాలంటూ ఎవరో కేసు వేశారు. ఇది ఎక్కడివరకు వెళ్తుందో కూడా తెలీదు. నాకు ఆ దేశానికి వెళ్లాలని మాత్రం లేదు. కాబట్టి నేను ఆందోళన చెందట్లేదు. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు వివిధ దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై ఆంక్షలుంటాయి. ఈ కారణంగా యాప్‌లోని చాలా కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. పలు దేశాల ప్రభుత్వాలు మమ్మల్ని జైల్లో పడేసేంత శక్తివంతమైన నిబంధనలు కలిగివుంటాయి. విదేశాల్లో ఉన్న అమెరికన్‌ టెక్‌ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నా' అని చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి: india vs england: భారత్ ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు

 2024 జనవరిలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఎక్స్‌, ఫేసుబుక్‌తో సహా పలు సామాజిక మాధ్యమాలపై పాకిస్థాన్‌ నిషేధం విధించింది. బలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. 

#telugu-news #pakistan #mark-zuckerberg #telugu-news-today #latest-telugu-news #rtv telugu news
Advertisment
తాజా కథనాలు