india vs england: భారత్ ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని సిరీస్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అదరగొట్టేశారు.

New Update
India won by england

India won by england

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుని సిరీస్ దక్కించుకుంది. 3-0 తేడాతో ఈ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అదరగొట్టేశారు.

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

గిల్ సెంచరీ

ఈ మూడో వన్డే మ్యాచ్‌లో శుభమన్ గిల్ చెలరేగిపోయాడు. సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన గిల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. 100 పరుగులు చేసి అందరిచేత సెల్యూట్ చేయించుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 95 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. (112; 102 బంతులలో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతక్కొట్టాడు.

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

శ్రేయస్ హాఫ్ సెంచరీ

శ్రేయస్ అయ్యర్ సైతం చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఫస్ట్ నుంచి తన ఫామ్‌లో ఎలాంటి ఛేంజెస్ లేకుండా.. అద్భుతమైన ఆట తీరుతో దూసుకుపోయాడు. శ్రేయస్ (78; 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి దుమ్ము దులిపేశాడు. 

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

కోహ్లి హాఫ్ సెంచరీ

ఇదిలా ఉంటే ఈ మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సైతం అద్భుమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఎడ్జ్ కటింగ్‌లతో ఫోర్లు కొట్టాడు. ఇప్పటి వరకు ఫామ్‌లో లేడని విమర్శించిన వారి నోర్లకు హాఫ్ సెంచరీతో అడ్డుకట్ట వేశాడు. చాలా నెలల తర్వాత కోహ్లి 50 పరుగులు పూర్తి చేసి ఔరా అనిపించాడు. కోహ్లీ (52; 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఫామ్‌లోకి వచ్చేశాడు.

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్ సైతం మంచి ఆటతీరు కనబరిచాడు. కేవలం 29 బాల్స్‌లో 40 పరుగులు చేసి అబ్బురపరిచాడు. రాహుల్ (40; 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. 
అలాగే హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా తమ బ్యాటింగ్‌తో పర్వాలేదనిపించుకున్నారు.
Advertisment
తాజా కథనాలు