Robot Olympic games: చైనాలో మామూలుగా లేదు.. రోబోలతోనే ఒలింపిక్ గేమ్స్..

టెక్నాలజీలో చైనా దూసుకుపోతోంది. ఏకంగా రోబోలతోనే అక్కడ గేమ్స్ ఆడిస్తున్నారు. హ్యుమనాయిడ్‌ రోబోలకు అక్కడ ఈ క్రీడలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నారు.మొదటిసారిగా వరల్డ్‌ హ్యూమనాయిడ్‌ రోబో గేమ్స్‌ అక్కడ జరగుతున్నాయి.

New Update
World's first robot Olympic games in China

World's first robot Olympic games in China

టెక్నాలజీలో చైనా దూసుకుపోతోంది. ఏకంగా రోబోలతోనే అక్కడ గేమ్స్ ఆడిస్తున్నారు. హ్యుమనాయిడ్‌ రోబోలకు అక్కడ ఈ క్రీడలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నారు. మొదటిసారిగా వరల్డ్‌ హ్యూమనాయిడ్‌ రోబో గేమ్స్‌ అక్కడ జరగుతున్నాయి. 16 దేశాలకు చెందిన 280 జట్లు ఆ క్రీడల్లో పాల్గొన్నాయి. ఇందులో రోబోలు టేబుల్ టెన్నిస్, ఫుట్‌బాల్, వస్తువులను తీసుకెళ్లడం, క్లినింగ్ సర్వీసెస్, ఔషధాలను గుర్తించడం వంటి పోటీల్లో పాల్గొన్నాయి. 

Also Read: ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్‌ పాస్‌లు వచ్చేశాయి.. ఒక్కసారి చెల్లిస్తే ఏడాదంతా తిరగొచ్చు

చైనా రాజధాని బీజింగ్‌లోని ది నేషనల్ స్పీడ్‌ స్కేటింగ్ ఓవల్‌లో ఈ గేమ్స్‌ను ప్రారంభించారు. బీజింగ్ మున్సిపల్‌ గవర్నమెంట్‌ ఆధ్వర్యంలో ఈ క్రీడలు జరుగుతున్నాయి. అక్కడి ఆటోమేషన్, ఏఐ లక్ష్యాలను ప్రపంచానికి చాటిచెప్పేలా వీటిని ప్రారంభించారు. ముందుగా సాకర్, బాక్సింగ్, స్పింట్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జర్మనీ, బ్రెజిల్, అమెరికా, జపాన్ లాంటి దేశాల నుంచి 192 యూనివర్సిటీలు, 88 ప్రైవేటు సంస్థలు కూడా ఈ క్రీడల్లో పాల్గొన్నాయి. చైనా నుంచి ఫోరియర్, యూనిట్రీ సంస్థలు పోటిపడుతున్నాయి.

Also Read: IAF రియల్ హీరో.. పాకిస్థాన్ జైలు నుంచి 2సార్లు తప్పించుకున్న వింగ్ కమాండర్ కథ!

గతేడాది చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాల్లో ఏకంగా 20 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. అంతేకాదు రాబోయేరోజుల్లో 137 బిలియన్ డాలర్లతో ఏఐ, రోబోటిక్ స్టార్ట్‌ప్‌ల కోసం ఓ నిధిని ఏర్పాటు చేయాలని చైనా సర్కార్‌ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఘనంగా ఇలాంటి రోబోటిక్స్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కొన్నేళ్ల క్రితం హ్యూమనాయిడ్‌ రోబోలతో తొలిసారిగా మారథాన్‌ రేసు నిర్వహించారు. కానీ అందులో పాల్గొన్నటువంటి రోబోలు పోటీ పూర్తికాకముందే దెబ్బతిన్నాయి. రోబోటిక్స్ రంగంలో చైనా రోజురోజుకు దూసుకుపోతుంది. ఏకంగా రోబోలతోనే ఆటలు నిర్వహించడంపై సోషల్ మీడియాలో చైనా పనితీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులు చేసే పనులు చాలావరకు రోబోలే చేస్తాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ఏఐ, రోబోల వల్ల అనేక ఉద్యోగాలు పోతాయని.. అలాగే కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 

Also Read: గూగుల్ క్రోమ్ కొనేందుకు పిచాయ్‌కి భారీ ఆఫర్ ఇచ్చిన అరవింద్ శ్రీనివాస్.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Advertisment
తాజా కథనాలు