H-4 Visa Work Permit:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిరాగానే భారతీయుకు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందే గ్రీన్ కార్డ్ హోల్డర్ల గుండెల్లో గుబులు మొదలైంది. ఇండియన్స్ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం రద్దు చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నూతన అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనుండగా.. అధికారం చేపట్టే రోజే ఈ ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు చర్చ నడుస్తోంది. ఇది గనుక నిజమైతే 10 లక్షల మంది భారతీయులపై ఎఫెక్ట్ పడనుంది.
RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ
ఇప్పుడు హెచ్–4 వీసాదారుల నెత్తి మీద రాయి పడింది. H-4 వీసాదారుల వర్క్ పెర్మిట్ రద్దు చేస్తారనే వార్త ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో టెన్షన్ పెంచేసింది. దీంతో చాలామంది ఇండియన్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. ఇంతకు ముందు H-4 వీసాదారులు ఉద్యోగాలు చేసుకునేందుకు బైడెన్ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. అయితే ట్రంప్ మొదటి నుంచీ అమెరికా ఫస్ట్ అనేది తన విధానమని ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అధ్యక్షుడిగా అయ్యాక కూడా అదే అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయనున్నారని చెబుతున్నారు.
Also Read: USA: ట్రంప్‌కు కాపలాకాస్తున్న రోబోటిక్ డాగ్స్..
అసలేంటీ హెచ్–4 వీసా..
H-1B వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలకు ఇచ్చేదే H-4 వీసా. లైఫ్ పార్టనర్ ద్వారా అమెరికాకు చేరుకుని మిగతా వారు తర్వాత వర్క్ పెర్మిట్ తెచ్చుకుని ఉద్యోగాలు చేసుకోవాలని ఇండియన్స్ అనుకుంటారు. నూటికి తొంభైమంది ఇలానే వస్తారు. లైఫ్ పార్టనర్ ఉద్యోగం, వారి వీసా స్థాయిని బట్టి అవతలి వారికి వర్క్ పర్మిట్ వస్తుంది. దాని ద్వారా వారు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకుంటారు. H-4 వీసాలు పొందిన వారిలో మెజార్టీ భారతీయ మహిళలే ఉంటారు. అమెరికాలో లక్షకు పైగా H-4 వీసా కలిగిన భారతీయ కుటుంబాలు ఉన్నాయి.
Also Read: AP cabinet: నవంబర్ 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ..