/rtv/media/media_files/2025/04/20/h33VkUjhlQA2XsRu3y4B.webp)
trump, putin
మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలస్కాలో భేటీ కానున్నారు. వీరిద్దరూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. రష్యాను కాల్పులు విరమణ దిశగా ఒప్పించే సన్నాహంలో ఉన్నారు ట్రంప్. ఎలాంటి అయినా రెండు దేశాల మధ్యనా శాంతి ఒప్పందం కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ముందు రష్యా తమ ఆంక్షలను పెట్టింది. ఇందులో డొనెట్స్క్‌లోని చివరి 9,000 చదరపు కిలోమీటర్ల నుంచి ఉక్రెయిన్ తొలకాలని...ఆ భూభాగాన్ని తమకు అప్పగించాలని రష్యా కోరుతోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం..
అయితే రష్యా ప్రతిపాదనలకు ఉక్రెయిన్ జెలెన్ స్కీ నో చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా ఆంక్షలను ఒప్పుకునేది లేదని ఆయన అన్నారు. ఈరోజు ఉక్రెయిన్ లోని కైవ్ లో జరిగిన మీడియా సమావేశంలో రష్యా ప్రతిపాదనను తోసిపుచ్చారు. డాన్బాస్ భూభాగాన్ని రష్యాకు అప్పగిస్తే మొత్తం ఉక్రెయిన్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుందని ఆయన అన్నారు. ఇది భవిష్యత్ యుద్ధానికి మార్గం సుగమం చేస్తుందని..వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా మీద ఈజీగా అటాక్ చేయగలరని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రత్యేక రాయబారి వెట్ కాఫ్ తో పుతిన్ సమావేశంలో ఈ డిమాండ్ ను ప్రతిపాదించారు. అయితే దీనిపై రష్యా వైఖరి స్పష్టంగా ఉన్నప్పటికీ...అమెరికా మాత్రం ఉక్రెయిన్ వైపే ఉందని జెలెన్ స్కీ చెప్పారు. ఆ ప్రదేశాన్ని తాము వదిలి వెళ్ళిపోవాలని యూఎస్ కూడా కోరుకోవడం లేదని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డాన్బాస్ ను అప్పగించమని ఎప్పటి నుంచో వత్తిడి తీసుకువస్తున్నారని...అదే కనుక చేస్తే భవిష్యత్తులో రష్యా దురాక్రమణను నిరోధించడానికి భద్రతా హామీలను కట్టబెట్టడం, చర్చలలో యూరోపియన్ దేశాలను చేర్చడం మరింత కష్టమవుతుందని జెలెన్ స్కీ తెలిపారు. 2014లో రష్యా క్రిమియాను ఇలాగే స్వాధీనం చేసుకుందని చెప్పారు.
మరోవైపు ట్రంప్, పుతిన్ శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్ పాల్గొంటుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే యూరోపియన్ యూనియన్ నాయకుల మాత్రం తాము ఈ సమావేశానికి హాజరు కావడం లేదని చెప్పేశారు.
మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని కీలకమైన వంతెనను రష్యా పేల్చేసింది. అలాగే వందకు పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు మృతి చెందారు. అంతకుముందు రష్యన్ ఆయిల్ రిఫైనరీని ఉక్రెయిన్ పేల్చిసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే రష్యా.. ఉక్రెయిన్ వంతెనపై పేల్చిసినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఉక్రెయిన్.. రష్యా ఆయిల్ రిఫైనరీని పేల్చేసింది. దీంతో భారీగా అక్కడ మంటలు చెలరేగాయి. అయితే రష్యన్ సైనిక అవసరాలు తీర్చేందుకు ఈ ఆయిల్ రిఫైనరీ నుంచే ఇంధనం సరఫరా అవుతోందని తెలుస్తోంది. అలాగే మిలిటరీ ఎయిర్‌బేస్‌తో సహా ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై ఉక్రెయిన్ దాడులు చేసింది.