H-1B visa: వీసాల జారీ మరింత ఆలస్యం..ఇకపై నో డ్రాప్ బాక్స్

హెచ్ 1 బీ వీసా మార్పలు రాను రాను భారతీయులకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. రోజుకో కొత్త రూల్ తీసుకువస్తూ ఎందుకొచ్చిన అమెరికా రా బాబూ అనేలా చేస్తున్నారు. తాజాగా డ్రాప్ బాక్స్ విధానాన్ని తీసేసి వీసాదారులకు మరింత కష్టాన్ని తీసుకువచ్చింది ట్రంప్ ప్రభుత్వం.

New Update
H1B Visa

H1B Visa

డ్రాప్ బాక్స్...వీసాలు కావాలనుకునే వారు ఇంటర్వ్యూలకు వెళ్ళక్కర్లేకుండా స్కిప్ చేసే విధానం. అన్ని డాక్యుమెంట్స్ ను వీసాల ఆఫీస్ లోని బాక్స్ లో పడేస్తే చాలు ఇంటికే వీసా వచ్చేసేది. దీని వలన పర్శనల్ ఇంటర్య్యూలు...అవి ఫెయిల్ అవడం అనే తలనొప్పి ఉండేది కాదు. దీని వలన వెయిటింగ్ టైమ్ కూడా చాలా తగ్గేది. వీసాలు తొందరగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా జారీ అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికింది.  సెప్టెంబర్ 2 నుంచి ఇది అమల్లోకి రానుంది. 

ట్రంప్ ప్రభుత్వం రాక మునుపు వరకు డ్రాప్ బాక్స్ విధానంతో ఓన్లీ హెచ్ 1 బీ దరఖాస్తు దారులే కాదు అన్ని కేటగిరీలు వాళ్ళు హ్యాపీగా వీసాలను పొందేవారు. ట్రంప్ అధికారం చేపట్టాక దీన్ని సగం కుదించారు. అంటే 48 నెలల కాలాన్ని 12 నెలలకు తగ్గించారు. అంటే వీసా అయిపోయిన 48 నెలల వరకు డ్రాప్ బాక్స్ ద్వారా రెన్యువల్ పొందే అవకాశం ఉండేది. మొదట దాన్ని 12 నెలల కాలానికి కుదించారు. అది కూడా చెప్పపెట్టకుండా, ముందే వార్నింగ్ కూడా ఇవ్వకుండా లేపేశారు. ఇప్పుడు దీన్ని కూడా మొత్తానికే ఎత్తేశారు. ఏకంగా డ్రాప్ బాక్స్ విధానికే స్వస్తి పలుకుతున్నారు.

భారతీయుల ఉద్యోగాలకు గండి.. 

ఈ కొత్త రూల్ వల్ల ముఖ్యంగా హెచ్ 1 వీసాదారులే కాకుండా టూరిస్ట్ వీసాదారుల మీద కూడా ప్రభావం పడనుంది. వీరు వీసా పునరుద్ధరణకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. నిజానికి కోవిడ్ కు ముందు ఈ కొత్త రూలే అమల్లో ఉండేది. అయితే కోవిడ్ టైమ్ లో వీసాల జాప్యం చాలా జరిగింది. దాంతో గుట్టలుగా వీసాలు పేరుకుపోయాయి. అందుకే అప్పుడు 12 నెలల కాలాన్ని 48 నెలలకు పెంచి తొందరగా వీసాలు ఇష్యూ అయ్యేలా చేశారు. 

ఇప్పుడు డ్రాప్ బాక్స్ విధానాన్ని పూర్తిగా తీసేయడం వలన అన్ని రకాల వీసాల జారీ ఆలస్యం అవనుంది. దీని వలన H-1B, L1, F1 వీసాలతో పాటూ చాలా మంది వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే. ఇది అందరి కంటే ఎక్కువగా భారతీయుల మీద ప్రభావం చూపించనుంది. దీని వలన వీసా ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ స్లాట్ లు మరింత ఆలస్యం కానున్నాయి. ఇప్పటికే రెండు నెలల టైమ్ పడుతోంది. ఇది మరింత పెరిగి నాలుగు, ఐదు నెలల వరకు వెళ్ళొచ్చని చెబుతున్నారు. అంతేకాదు వాసీ రిజెక్షన్ కూడా పెరిగే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ కొత్త నిబంధనలో A-1, A-2, C-3 (అటెండర్లు లేదా సేవకులు మినహాయించి), G-1 నుండి G-4, NATO-1 నుండి NATO-6,  TECRO E-1 వీసా వర్గాల వారికి వెసులుబాటును కల్పించారు. 

అందరి కంటే హెచ్ 1బీ వీసా హోల్డర్లకు ఎక్కువ ప్రభావం చూపించనుంది. ఎందుకంటే వీరిలో ఎక్కువ భాగం భారతీయులకే ఇస్తున్నారు. ప్రతీ ఏడాది 3, 50000 లక్షలకు పైగానే హెచ్ 1బీ వీసాలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త రూల్ వలన ఈ సంఖ్య తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో అమెరికాకు వచ్చే నిపుణుల సంఖ్య కూడా తగ్గిపోతుందని అంటున్నారు. అలాగే స్వదేశాలు దూరంగా ఉన్న వీసా హోల్డర్లకు, వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరవ్వాలనే నియమం సవాల్ గా మారుతుందని చెబుతున్నారు. 

Also Read: J&K: కాశ్మీర్ లో భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న బెడ్ రూం జీహాదీలు..ఎవరు వీళ్ళు?

Advertisment
తాజా కథనాలు